Home Entertainment ఆచార్య మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఆచార్య మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
2,155

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషించడం తో తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒక్కే తెరపై చూడచ్చు అని మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమా కి ఇప్పుడు సూపర్ మహేష్ బాబు రూపం లో మరో ప్రత్యేకత కూడా తోడు అయ్యింది..ఈ సినిమాకి మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు అని స్వయంగా చిరంజీవి అధికారికంగా ప్రకటించాడు..మహేష్ బాబు ఇప్పటి వరుకు వాయిస్ ఓవర్ ఇచ్చిన జల్సా మరియు బాద్ షా సినిమాలు బాక్స్ ఆఫీస్ వడ మంచి విజయాలు గా నమోదు చేసుకున్నాయి..ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఆచార్య సినిమాకి కూడా పని చేస్తుంది అని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు..ఇది ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది..ఆ విశేషాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

మెగాస్టార్ నుండి వస్తున్నా ఈ మెగా మాస్ మూవీ కి సెన్సార్ సభ్యులు UA సర్టిఫికెట్ ఇచ్చారు..చాలా కాలం తర్వాత వింటేజ్ మెగాస్టార్ చిరంజీవి ని చూసాము అని..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి అని..ఇక అభిమానులకు అయితే ఈ సన్నివేశాలు వెండితెర మీద వచ్చినప్పుడు అనందం తో చొక్కాలు చించేసుకుంటారు అని సెన్సార్ సభ్యులు ఈ సందర్భంగా మూవీ యూనిట్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు అట..మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు పాటలు ఆన్ స్క్రీన్ మీద చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని , ముఖ్యం గా ఇంటర్వెల్ ఫైట్ అప్పుడు వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లు నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మన బుర్రని వెంటాడుతూనే ఉంటుంది అట..మని శర్మ గారు ఆ స్థాయి మ్యూజిక్ ని ఈ సినిమా కి ఆనించారు అని సెన్సార్ సభ్యులు చెప్తున్నారు..ప్రీ ఇంటర్వెల్ సీన్ నుండి క్లైమాక్స్ వరుకు ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అని, ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఎవ్వరు ఊహించినది అని, అభిమానులకు థియేటర్ లో ఈ ట్విస్ట్ కి ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం అని తెలుస్తుంది..వింటుంటేనే గురు బంప్స్ వచేతున్నాయి కదూ..!, ఇక థియేటర్ లో మొదటి రోజు అభిమానుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది..కానీ ట్రైలర్ లో ఎక్కడ కూడా కాజల్ అగర్వాల్ కనిపిసిమ్హాకపోవడం తో ఆమె పాత్ర ఈ సినిమా లో ఉందా..లేకపోతే రామ్ చరణ్ పాత్రని పెంచడం కోసం ఆమెని క్యారక్టర్ నిడివి ని బాగా తగ్గించేసారా అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి..తొలుత ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారక్టర్ నిడివి కేవలం 25 నిముషాలు మాత్రమే ఉండేది అట..కానీ అభిమానుల కోసం ఆ పాత్ర నిడివి ని బాగా పెంచి రామ్ చరణ్ కి రెండు పాటలు ఉండే రేంజ్ స్కోప్ ని ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ..దీని వల్ల కాజల్ అగర్వాల్ పాత్ర బాగా తగ్గించేశారు అనే టాక్ కూడా సోషల్ మీడియా లో జోరుగా వినిపిస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

సింగర్ వాణి జయరాం మృతి పై తలెత్తుతున్న అనుమానాలు..!

కన్నడతో పాటు పలు భాషల్లో 10,000కు పైగా పాటలు పాడిన నటి వాణీ జయరామ్ ఈరోజు (ఫిబ్రవరి 4) చెన్…