
మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఆచార్య సినిమా ఎట్టకేలకు ఈ నెల 29 వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే.. ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక్క ముఖ్య పాత్ర పోషించాడు..తొలి సారి చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క సినిమా చెయ్యడం తో ఈ మూవీ పై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగట్టు గానే ఇటీవల విడుదల అయిన ఈ సినిమా ట్రైలర్ కి అద్భుతమైన రెఫాన్సే వచ్చింది..ముఖ్యంగా రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి ఉన్న షాట్స్ కి అయితే అభిమానులు మెంటలెక్కిపొయ్యారు..ఇక థియేటర్స్ లో వీళ్ళు కలిసి ఉన్న సన్నివేశాలు చూస్తే అభిమానులు ఏమైపోతారో..ఇది ఇలా ఉండగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి సోషల్ మీడియా లో వస్తున్నా ఒక్క వార్త ఇప్పుడు మెగా అభిమానులలో గందరగోళం సృష్టిస్తుంది.
అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిధి గా హాజరు కాబోతున్నారు అని..చిరంజీవి గారే స్వయంగా ఆయనని ఆహ్వానించారు అని ఒక్క వార్త తెగ ప్రచారం అయిన సంగతి మన అందరికి తెలిసిందే…సోషల్ మీడియా మరియు మెయిన్ మీడియా మొత్తం ఈ వార్త నిన్న సెన్సేషన్ సృష్టించింది..దీనితో పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు మెగా అభిమానులు మధ్య సోషల్ మీడియా లో పెద్ద గొడవే జరిగింది..సొంత తమ్ముడు సినిమాని టార్గెట్ చేసి అంత దారుణంగా తొక్కినా మనిషిని ఎలా పిలుస్తావు అంటూ చిరంజీవి ని టాగ్ చేస్తూ ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానులు తిట్టడం మొదలు పెట్టారు..దీనికి మెగా ఫాన్స్ స్పందించి వాళ్ళు కూడా వాదన కి రావడం తో కాసేపు సోషల్ మీడియా మొత్తం అట్టుడికిపోయింది..అయితే ఈ వార్త ని గమనించిన వైసీపీ సోషల్ మీడియా టీం , జగన్ గారు వస్తారు అనేది ఇంకా కంఫర్మ్ కాలేదు అని అనడం తో కాసేపు వాడివేడిగా కొనసాగిన సోషల్ మీడియా చర్చలు కాస్త చల్లబడ్డాయి.
కానీ ఇప్పటికి కొన్ని నమ్మదగ్గ మీడియా చానెల్స్ నుండి అందుతున్న వార్త ఏమిటి అంటే జగన్ గారు నిజంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి రాబోతున్నారు అనే అంటున్నాయి..మరి కొన్ని మీడియా సంస్థలు అలాంటిది ఏమి లేదు అని..ఈ నెల 23 వ తారీఖున హైదరాబాద్ యూసఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది అని ..ఈ ఈవెంట్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రాజమౌళి ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు అని చెప్తున్నాయి..ఈ రెండిట్లో ఏది నిజం ఏది అబ్బదం అనేది మరో రెండు మూడు రోజుల్లో తెలియనుంది..ఒక్కవేల జగన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తే పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి చిరంజీవి గారికి బలమైన తాకిడి తప్పదు అనే చెప్పొచ్చు..ఏమి జరగబోతుందో చూడాలి మరి..ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయింది అని..త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోబోతుంది అని తెలుస్తుంది,ఇక చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి డాన్స్ వేసిన వీడియో సాంగ్ ఈ నెల 20 వ తారీఖున విడుదల చేయబోతుంది చిత్ర యూనిట్..ఈ సాంగ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.