
టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఆయన 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల నుంచి 30 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి కోట్ల ఆస్తులున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్‌గానూ రాణిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. అయితే ఇటీవల చిరంజీవి విలువైన ఆస్తిని అమ్మేసినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మెగాస్టార్‌కు ఆస్తులు అమ్ముకోవాల్సిన కర్మ ఏం వచ్చిందంటూ అభిమానులు ఆరాలు తీయడం మొదలుపెట్టారు. హైదరాబాద్ నగరంలో చిరంజీవికి ఎన్నో ఆస్తులున్నాయి. స్థలాలు, ఇళ్లు రూపంలో చిరంజీవి ఆస్తులు కూడబెట్టారు.
హైదరాబాద్ ఫిలింనగర్‌లో మెయిన్ రోడ్డు మీద కీలక ప్రదేశంలో చిరంజీవికి మూడు వేల గజాల స్థలం ఉంది. గతంలో ఈ స్థలాన్ని చిరంజీవి కేవలం రూ.30 లక్షలకు కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ స్థలం కోట్లలో పలుకుతోంది. దీంతో ఈ స్థలాన్ని రూ.70 కోట్లకు చిరంజీవి విక్రయించినట్లు సమాచారం అందుతోంది. ఇంత విలువైన స్థలాన్ని చిరంజీవి అమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్థలం మీద ఓ పాపులర్ దినపత్రిక యజమాని కన్ను పడినట్లు ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా ఆ దినపత్రికకు చెందినవారు ఈ స్థలం తమకు అమ్మాలని చిరంజీవిని అడుగుతున్నారని.. ఈ స్థలంలో సదరు దినపత్రికకు సంబంధించిన ఛానల్ కార్యాలయం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. దీంతో సదరు దినపత్రిక యజమాని పోరు భరించలేక చిరంజీవి తనకు డబ్బు అవసరం లేకపోయినా తన స్థలాన్ని అమ్మేసినట్లు ఆయన సన్నిహితులు వివరిస్తున్నారు.
ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళాశంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాఢ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అటు చిరంజీవి బర్త్ డే రోజు మెగా గ్రాండ్ కార్నివల్ నిర్వహించాలని నిర్ణయించినట్లు నాగబాబు వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా మెగా గ్రాండ్ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు. 20 ఏళ్లకు పైగా మెగా అభిమానులు చూపించే ఆదరాభిమానాలను దృష్టిలో ఉంచుకుని వాళ్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు నాగబాబు తెలిపారు. గోవా కార్నివల్, బ్రెజిల్ కార్నివల్ రేంజ్‌లో కాకపోయినా తెలుగు సినీ పరిశ్రమలో తొలిసారిగా అభిమానుల కోసం కార్నివల్ ఏర్పాటు చేస్తున్నామని.. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క మెగా అభిమాని తరలిరావాలని ఆహ్వానం పలికారు. ఈ వేడుకల్లో పాల్గొనాలని భావించే అభిమానులకు పాసులు జారీ చేస్తామని.. ఈ పాసులను ఈనెల 19 నుంచి బ్లడ్ బ్యాంక్, అభిమాన సంఘాల వద్ద తీసుకోవచ్చని నాగబాబు సూచించారు.