
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన మెగా ముల్టీస్టార్ర్ర్ ఆచార్య చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయం పాలైన సంగతి మన అందరికి తెలిసిందే..40 ఏళ్ళ మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి..ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ వచ్చిన కూడా చిరంజీవి సినిమా అంటే కనీసం వీకెండ్ వరుకు అదిరిపొయ్యే కలెక్షన్స్ వస్తాయి..కానీ ఆచార్య విషయం లో అది పూర్తిగా రెవెర్స్ అయ్యింది..విడుదలైన మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి మొదటి రోజే చాలా చోట్ల థియేటర్స్ ఖాళి అయ్యాయి..కిలో మెగాస్టార్ కెరీర్ లో ఎప్పుడూ కూడా జరగలేదు..ఎంత ఫ్లాప్ అయినా కూడా 70 కోట్ల రూపాయిల షేర్ ఫుల్ రన్ లో వసూలు చేస్తుంది అనుకున్నారు..కానీ క్లోసింగ్ కి ఈ సినిమా కేవలం 48 కోట్ల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసి బయ్యర్స్ కి 80 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది.
ఆ 48 కోట్ల రూపాయలలో కూడా 10 కోట్ల రూపాయిలు హైర్స్ ఉన్నాయి..అది తీసేస్తే ఈ సినిమాకి వచ్చిన వర్త్ వసూళ్లు 38 కోట్ల రూపాయిలు మాత్రమే..మెగాస్టార్ రేంజ్ కి ఇది దారుణమైన వసూళ్లు అనే చెప్పాలి..ఇప్పుడు ఈ ఆచార్య సినిమా వర్త్ వసూళ్లను ఇటీవల విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ భింబిసారా చిత్రం దాటేసినట్టు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట..నైజాం మరియు రాయలసీమ వంటి ప్రాంతాలలో ఆచార్య మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ని భింబిసారా చిత్రం దాటేసింది..ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా ఈ సినిమాకి ఆచార్య కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి..రెండు వారాలకు గాను 34 కోట్ల రూపాయిలు షేర్ ని రాబట్టిన భింబిసారా చిత్రం ఫుల్ రన్ ముగిసే సమయానికి 36 కోట్ల రూపాయిల మార్కుని అందుకునే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి..అంటే ఆచార్య సినిమా క్లోసింగ్ కలెక్షన్స్ కి రెండు కోట్లు తక్కువ అన్నమాట.
టాలీవుడ్ లో అసలు ఏ మాత్రం మార్కెట్ లేని నందమూరి కళ్యాణ్ రామ్ సినిమానే 35 కోట్ల రూపాయిలు షేర్ వసూళ్లను రాబడితే..ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చి రెండు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని అవలీలగా అందుకున్న చిరంజీవి లాంటి మెగాస్టార్ కి కరెక్ట్ సినిమా పడితే ఇంకా ఎంత వసూళ్లు రావాలి..?, కానీ నమ్మి అవకాశం ఇస్తే కొరటాల శివ లాంటి దర్శకుడు చిరంజీవి కెరీర్ లో మాయని మచ్చ లాంటి సినిమాని అందించాడు..ఇది మెగా అభిమానులు ఎప్పటికి మర్చిపోలేనిది..ఇప్పుడు మెగా ఫాన్స్ మొత్తం చిరంజీవి తదుపరి చిత్రం గాడ్ ఫాదర్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్..తమిళ దర్శకుడు మోహన్ రాజా ఈ రీమేక్ కి దర్శకత్వం వహించాడు..అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఔట్పుట్ అదిరిపోయింది అట..రేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భం గా ఈ సినిమా టీజర్ విడుదల కాబోతుంది.