Home Entertainment ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదేనా..ఇలా తీసి ఉంటె ఒక్క రికార్డు కూడా మిగిలేది కాదు

ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదేనా..ఇలా తీసి ఉంటె ఒక్క రికార్డు కూడా మిగిలేది కాదు

0 second read
0
2
63,496

మన టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది కొరటాల శివ మాత్రమే అని కళ్ళు మూసుకొని చెప్పేయొచ్చు..మిర్చి సినిమాతో ప్రారంభం అయినా కొరటాల శివ కెరీర్ శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ మరియు భరత్ అనే నేను వంటి సెన్సషనల్ హిట్ సినిమాలు తో బాక్స్ ఆఫీస్ పై ఆయన దందా యాత్ర చేసాడు..అలాంటి డైరెక్టర్ మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి హీరోలతో మల్టీస్టార్ర్ర్ సినిమా చేస్తే ఎలా ఉండాలి??, అభిమానులు మాత్రమే కాదు , ప్రతి ప్రేక్షకుడు ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని బద్దలు అవుతాయి అనే అంచనా వేస్తాడు, కానీ కరోనా కారణంగా లాక్ డౌన్స్ వల్ల ఈ సినిమా అన్ని సార్లు వాయిదా పడడం వల్లనో, లేకపోతే ఒక్కేసారి జనాలు రెండు పాన్ ఇండియా సినిమాలను ఎగబడి చూసిన మూడ్ లో ఉండడం వల్లో ఏమో తెలీదు కానీ..ఈ సినిమా ఓపెనింగ్స్ నుండి అతి తక్కువ కలెక్షన్స్ ని నమోదు చేసుకొని అభిమానుల అంచనాలను తలక్రిందులు చేసింది..137 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో కనీసం 50 కోట్ల రూపాయిల షేర్ కూడా వసూలు చేసే అవకాశం కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా.

కొరటాల శివ ఈ సినిమా ని చాలా కేర్ లెస్ గా తీసాడు అని ..స్క్రిప్ట్ రాయడం దగ్గర నుండే ఆయన ఈ సినిమాలో ఘోరంగా విఫలం అయ్యాడు అని , చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఉన్న సన్నివేశాలు ఒక్క రేంజ్ లో ఉంటాయి అనుకుంటే కనీస స్థాయి లో కూడా రాలేదు అని, భలే భలే బంజారా సాంగ్ తప్ప సినిమా లో ఆకట్టుకునే అంశాలు ఏమి లేవి అని అభిమానులు తీవ్రమైన నిరాశకి గురి అయ్యారు..ఇది ఇలా ఉండగా ఈ సినిమా కి ముందు అనుకున్న కథ ఇది కాదు అట..కొరటాల శివ చిరంజీవి ని ఇందులో దేవాదాయ శాఖలో పని చేసే ప్రభుత్వ అధికారిగా చూపించాలి అని అనుకున్నాడు అని..చిరంజీవి యువతరం లో ఉన్నప్పటి పాత్రని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయించే విధంగా ఆయన స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు అట..ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో తెలియదు కానీ , ఆ స్క్రిప్ట్ ని కాకుండా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో ఉన్న స్క్రిప్ట్ తో ఆచార్య సినిమా చేసాడు..దాని ఫలితమే ఈరోజు మన అందరం చూస్తున్నాము..ఒక్కవేల ఈ సినిమా ముందు అనుకున్న ఆ కథతోనే తీసి ఉంటె ఈరోజు ఇండస్ట్రీ హిట్ కూడా అయ్యే ఛాన్స్ ఉండేది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.

ఓపెనింగ్స్ లో దారుణంగా విఫలం అయినా ఆచార్య ఫుల్ రన్ లో కూడా బొక్క బోర్లా పడడం తో ఈ సినిమాకి 80 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది అట..దీనితో ఈ సినిమా ని ఎక్కువ ప్రాంతాలలో హక్కులను కొనుగోలు చేసిన ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ ని మాకు కనీసం 50 కోట్లు రూపాయిలు అయినా వెనక్కి తిరిగి ఇవ్వాలి అని బయ్యర్లు ఒత్తిడి చేస్తున్నారు అట..ఈ వారం లో ఆయన తన నివాసం లో బయ్యర్స్ తో భేటీ కాబోతున్నాడు..ఈ భేటీ అనంతరం ఎంత డబ్బులు తిరిగి ఇవ్వాలి అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు అట..ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇది మిర్చి లాంటి ఊర మాస్ సినిమా అని..ఈసారి ఎలాంటి సోషల్ ఎలిమెంట్స్ వైపు పోకుండా ఈ సినిమా స్క్రిప్ట్ ని సిద్ధం చేశాను అని కొరటాల శివ ఆచార్య మూవీ ప్రొమోషన్స్ లో తెలిపిన సంగతి మన అందరికి తెలిపాడు..ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాథర్ అనే సినిమాలో నటిస్తున్నాడు..మలయాళం లో సూపర్ హిట్ అయినా మోహన్ లాల్ లూసిఫెర్ సినిమాకి ఇది రీమేక్ గా తెరకెక్కింది..షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్, మరి ఈ రెండు సినిమాలతో అటు కొరటాల శివ , ఇటు మెగాస్టార్ చిరంజీవి బౌన్స్ బ్యాక్ అవుతాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

బ్రేకింగ్ : విడాకులు తీసుకున్న నిహారిక కొణిదెల – చైతన్య..గుండెలు పగిలేలా ఏడుస్తున్న నాగబాబు

ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది.సమంత – నాగ చైతన…