Home Entertainment ఆగిపోయిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా..ఆందోళనలో అభిమానులు

ఆగిపోయిన పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా..ఆందోళనలో అభిమానులు

0 second read
0
0
27,431

అజ్ఞాత వాసి సినిమా తర్వాత సుమారు మూడేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తీసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన వకీల్ సాబ్ మరియు భీమ్లా నాయక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ రెండు సినిమాలకి ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయ వత్తిడులు వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్న తిరుగు లేని స్టార్ డమ్ వల్ల సూపర్ హిట్స్ గా నిలిచాయి..ఇక ఈ సినిమాల తర్వాత తొలిసారి ఆయన జాపాద నేపథ్యం లో ప్రముఖ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న చిత్రం హరి హర వీర మల్లు..ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 50 శాతం వరుకు పూర్తి అయ్యింది..సుమారు 150 కోట్ల రుపాయిలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిచిపోయింది..కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ ప్రారంబించుకున్న ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది..ఇంటర్వెల్ లో పవన్ కళ్యాణ్ మీద వచ్చే భారీ పోరాట సన్నివేశం ని ఈ షెడ్యూల్స్ లో షూటింగ్ చేసారు..ఇక మూడవ షెడ్యూల్ చెయ్యడం కోసం హైదరాబాద్ లోని అల్లుమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్స్ వేశారు.

మూడవ షెడ్యూల్ ని ప్రారంభించడానికి సర్వం సిద్ధం ఉన్నప్పటికీ కూడా ఆర్టిస్టుల డేట్స్ సమస్య రావడం తో ప్రస్తుతానికి ఈ చిత్రం షూటింగ్ ని నిలిపివేశారు..మరో పది రోజుల్లో ఆర్టిస్టుల డేట్స్ అందుబాటులోకి వస్తాయి అని..షూటింగ్ యదావిధిగా సాగుతుంది అని ఆ చిత్ర నిర్మాతలు చెప్తున్నారు..అయితే సోషల్ మీడియా లో ఒక్క వర్గపు వెబ్ సైట్లు బడ్జెట్ కారణంగా హరిహర వీరమల్లు షూటింగ్ నిలిచిపోయింది అంటూ ప్రచారాలు చేసాయి..షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండడం తో ఆ చిత్ర నిర్మాత AM రత్నం గారికి అప్పులు మరియు వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి అని, అందుకే ఆయనకీ ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రావట్లేదు అని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం సాగాయి..అయితే ఈ వార్తలపై ఆ చిత్ర బృందం చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యింది..సోషల్ మీడియా లో వచ్చే అసత్యపు వార్తలు నమ్మి అభిమానులు కంగారు పడొద్దు అని,ఈ సినిమా షూటింగ్ జులై లోపు మొత్తం పూర్తి అవుతుంది అని..పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేస్తాము అని చెప్పుకొచ్చారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ఔట్పుట్ గురించి ఫిలిం నగర్ లో సాగుతున్న ఒక్క చర్చ అభిమానుల్లో ఫుల్ జోష్ ని నింపుతుంది..అదేమిటి అంటే ఈ సినిమా ఔట్పుట్ ఇప్పటి వరుకు తీసింది మొత్తం అత్యద్భుతంగా వచ్చింది అట..ఈ సినిమాలో పోరాట సన్నివేశాలు అన్ని ఇప్పటి వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఎవ్వరు చూడని రేంజ్ లో డిసైన్ చేసారు అట డైరెక్టర్ క్రిష్..పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ సన్నివేశాలు కోసం మార్షల్ ఆర్ట్స్ లో కొత్త ఫామ్ ని నేర్చుకున్నాడు అని..అభిమానులకు ఈ సినిమా లోని ప్రతి సన్నివేశం పూనకాలు రప్పించే రేంజ్ లో ఉంటుంది అని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్..నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు..క్రిష్ గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయాలు పాలవ్వడం తో ఈ సినిమాని ఎలా అయినా అద్భుతంగా తీసి తనని తాని నిరూపించుకోవాలి అని ఈ సినిమా విషయం లో చాలా కసిగా పని చేస్తున్నాడు అట..ఎలా అయినా ఈ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో దర్శకుడిగా తన సత్తా చాటాలని చూస్తున్నాడు అట..చూడాలి మరి ఈ సినిమాతో ఆయన అనుకున్నది సాధిస్తాడా లేదా అనేది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…