Home Entertainment ఆకాశ వనం లో అర్జున కళ్యాణం మూవీ కలెక్షన్ల వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఆకాశ వనం లో అర్జున కళ్యాణం మూవీ కలెక్షన్ల వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం

1 second read
0
5
40,755

మన టాలీవుడ్ లో ఒక్క మంచి కామెడీ సినిమా చూసి చాలా కాలమే అయ్యింది..అలా వినోదం కొరత ఉన్న సమయం లో విడుదల అయిన DJ టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఇటీవల కాలం లో నిర్మాతకు అత్యంత లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలలో ఇది కూడా ఒక్కటి..ఇప్పుడు విశ్వక్ సేన్ హీరో గా నటించిన ‘ఆకాశ వనం లో అర్జున కళ్యాణం’ సినిమా కూడా మంచి వినోదభరిత చిత్రం గా రివ్యూస్ కొట్టేసి విశ్వక్ సేన్ కెరీర్ బెస్ట్ హిట్ చిత్రాలలో ఒక్కటిగా నిలిచింది..ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం విశ్వక్ సేన్ వార్తల్లో ఎలా నిలిచాడో మన అందరికి తెలిసిందే..రోడ్స్ మీద ప్రాంక్ చేస్తూ జనాల దృష్టిని తనవైపు మరిలేల చేసాడు..అంతే కాకుండా టీవీ 9 న్యూస్ ఛానల్ ఈ విశ్వక్ సేన్ చేస్తున్న ప్రాంక్స్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ లైవ్ డిబేట్స్ కూడా చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ డిబేట్స్ లో విశ్వక్ సేన్ కూడా పాల్గొని టీవీ 9 రిపోర్టర్ దేవి తో గొడవలు పెట్టుకున్న సంఘటన సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ సంఘటన విశ్వక్ సేన్ కి మంచి ప్లస్ అయ్యింది అనే చెప్పాలి.

ప్రమోషన్స్ పెద్దగా లేకుండానే కేవలం ఈ వీడియో తో తెగ వైరల్ అయ్యిపోయాడు విశ్వక్ సేన్..దానితో ఆయన లేటెస్ట్ సినిమా ఆకాశవానం లో అర్జున కళ్యాణం కి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి..కేవలం 50 లక్షల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ బిసినెస్ ద్వారానే నిర్మాతకి నాలుగు కోట్ల 50 లక్షల రూపాలు వచ్చాయి..అంటే నిర్మాతకి విడుదలకి ముందే నాలుగు కోట్ల రూపాయిల లాభం అన్నమాట..ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లకు కేవలం మూడు రోజుల్లోనే దాదాపుగా రెండున్నర కోటి రూపాయిల షేర్ వచ్చింది..అంతే 50 శాతం కి పైగా రికవరీ కేవలం వీకెండ్ లోనే చేసేసింది ఈ సినిమా..ఫుల్ రన్ లో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అని బయ్యర్లు గట్టి నమ్మకం తో ఉన్నారు..వీకెండ్ వరుకు అద్భుతమైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా వీకెండ్ తర్వాత మాములు పని దినాలలో కూడా డీసెంట్ వసూళ్లను రప్పించుకొని కేవలం 5 రోజుల్లోనే 3 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది..మరో రెండు రోజుల్లో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా వస్తుండడం తో ఈ సినిమా కి థియేటర్స్ బాగా తగ్గిపొయ్యే అవకాశం ఉంది.

సర్కారు వారి పాట సినిమా వచ్చినప్పటికీ కూడా కొన్ని షోస్ ని ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోల్డ్ చేసుకుంటున్నారు బయ్యర్లు..ఎందుకంటే ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకి డీసెంట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నది..సర్కారు వారి పాట సినిమాకి టికెట్స్ దొరకని వాళ్ళు ఈ సినిమాకి వచ్చినా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా దాటేస్తుంది అని ట్రేడ్ వర్గాల నుండి వినిపిస్తున్న వార్త..ఇక ఈ సినిమాలో అల్లం అర్జున్ ప్రసాద్ అనే పాత్రలో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించాడు..ఆయన పాత్రలో ఉన్న అమాయకత్వం మన చేత నవ్వులు పూయించేలా చేస్తుంది..ఈ సినిమాలో ఆయన 33 ఏళ్ళు వచ్చిన పెళ్లి కానీ ఒక్క యువకుడి పాత్రలో మనకి కనిపిస్తాడు..క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని థియేటర్స్ లో కుటుంబ సమేతంగా వెళ్లి మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు..ఇంక ఎందుకు ఆలస్యం, వెంటనే బుక్ మై షో ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేసుకొని ఈ సినిమాని చూసేయండి.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…