Home Entertainment ఆకాశవనం లో అర్జున కళ్యాణం మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

ఆకాశవనం లో అర్జున కళ్యాణం మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ ఎక్సక్లూసివ్ గా మీకోసం

0 second read
0
0
634

మన టాలీవుడ్ లో ఇటీవల కాలం లో వరుసగా సీరియస్ కథనాలతో సాగే సినిమాలను చూసి చూసి బోర్ కొట్టేసింది..జనాలు ఒక్క మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కోసం ఎంతో కాలం నుండి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు..అలాంటి వారి ఎదురు చూపులకు తెర దించుతూ ఇటీవల విడుదల అయినా విశ్వక్ సేన్ ‘ఆకాశ వనం లో అర్జున కళ్యాణం’ సినిమా మంచి వినోదాత్మక చిత్రంగా రివ్యూస్ కొట్టేసింది..రివ్యూస్ అన్ని సూపర్ గా ఉండడం తో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి..అయితే ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అవ్వడం ఈ మూవీ పై గట్టి ప్రభావమే పడింది..కానీ సర్కారు వారి పాట సినిమా బాక్స్ ఆఫీస్ మేనియా ని తట్టుకొని ఈ సినిమా దాదాపుగా బ్రేక్ ఇన్ మార్కుకి దగ్గరకి వచ్చింది..50 లక్షల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు జరిగింది..ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఈ సినిమా విడుదలకి ముందు హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రొమోషన్స్ ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ ని తీసుకొని రావడం లో సహాయపడ్డాయి..రోడ్ల మీద ఈయన చేసిన కొన్ని ప్రాంక్ వీడియోస్ ని ఒక్క ప్రముఖ మీడియా ఛానల్ తప్పుబట్టి లైవ్ డిబేట్స్ నిర్వహించి పెద్ద దుమారం రేపిన సంగతి మన అందరికి తెలిసిందే..లైవ్ డిబేట్ లో పాల్గొన్న విశ్వక్ సేన్ ఒక్క ప్రముఖ యాంకర్ తో గొడవపడిన ఒక్క వీడియో సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆ గొడవ ఈ సినిమా ప్రొమోషన్స్ కి బాగా ఉపయోగపడ్డాయి..ఓపెనింగ్స్ లో తోలి రోజే ఈ సినిమా ఏకంగా కోటి రూపాయిల షేర్ ని దక్కించుకుంది..అంతకు ముందు ఈ సినిమా ఒక్కటి ఉంది అనేది కూడా ఎవ్వరికి తెలీదు..కానీ విశ్వక్ సేన్ చేసిన ప్రొమోషన్స్ మరియు యాంకర్ తో గొడవ పడిన వీడియో వల్ల ఈ సినిమాని బ్రేక్ ఈవెన్ మార్కుకి దగ్గరకి వెళ్లేలా చేసింది..మొదటి రోజు కోటి రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం..రెండవ రోజు మూడవ రోజు కూడా డీసెంట్ వసూళ్లను దక్కించుకుంది.

ఇక ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమా థియేటర్స్ లో రావడం తో ఈ మూవీ జనాల్లోకి అంతలా వెళ్లలేకపోయింది..కానీ ఆ సినిమా ధాటిని తట్టుకొని కూడా ఈ మూవీ ఫుల్ రన్ లో 3 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ ని సొంతం చేసుకుంది అంటే మాటలు కాదు అనే చెప్పాలి..20 లక్షల రూపాయిల స్వల్ప నష్టాలను చవి చూసిన ఈ సినిమా, OTT లోకి వచ్చిన తర్వాత మంచి లాభాలను దక్కించుకుంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా..ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్ కి కూడా మంచి బూస్ట్ ని ఇచ్చింది అనే చెప్పాలి..ఈ సినిమా తర్వాత ఆయనకీ ఒక్క క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే ఛాన్స్ దక్కేసింది..అంతే కాకుండా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా విశ్వక్ సేన్ ని హీరో గా పెట్టి ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఈ సినిమా తో పాటుగా యాక్షన్ కింగ్ అర్జున్ తొలిసారి దర్శకత్వం వహించబోతున్న సినిమాలో కూడా విశ్వక్ సేన్ హీరో గా నటించనున్నాడు..ఇలా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో యూత్ ని పిచేక్కించేందుకు సిద్ధం అయ్యాడు విశ్వక్ సేన్.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…