Home Entertainment ‘అవతార్ 2’ రెండు రోజుల వసూళ్లు..డిజాస్టర్ దిశగా అడుగులు

‘అవతార్ 2’ రెండు రోజుల వసూళ్లు..డిజాస్టర్ దిశగా అడుగులు

0 second read
0
0
1,493

కొన్ని కొన్ని సార్లు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుంది అని అనుకున్న సినిమాలు, ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము..ఇప్పుడు దానికి లేటెస్ట్ క్లాసిక్ ఉదాహరణగా అవతార్ 2 చిత్రం నిలిచిపోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు..మొదటిరోజు టాక్ కూడా అనుకున్న రేంజ్ లో రాలేదు..అలా అని నెగటివ్ టాక్ కూడా కాదు..అవతార్ ఫ్రాంచైజ్ నుండి వస్తున్న సినిమా కాబట్టి ఎలాంటి సెన్సేషనల్ టాక్ ని ఊహిస్తామో అది రాలేదన్నమాట..ఓపెనింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి..మొదటి రోజు ఈ చిత్రం ఇండియా లో ఆల్ టైం రికార్డు అయితే నెలకొల్పలేకపోయింది కానీ, ఆల్ టైం టాప్ 2 హాలీవుడ్ చిత్రం గా నిలిచింది..ఇక నార్త్ అమెరికా లో అయితే టాప్ 2 స్థానం కాదు..టాప్ 5 స్థానానికి పడిపోయింది ఈ చిత్రం ఓపెనింగ్స్.

మొదటి రోజు ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది,ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది..ఇది టాలీవుడ్ వరుకు విడుదలైన హాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలతో పోలిస్తే ఆల్ టైం డే 1 రికార్డు గా చెప్పుకోవచ్చు..14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అంటే 7 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు అన్నమాట..వాస్తవానికి ఇది అద్భుతమైన వసూళ్లే..కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ జోరు చాలదు..ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం తెలుగు వెర్షన్ కి 100 కోట్ల రూపాయిల వరుకు జరిగిందట..ఈ సినిమా వంద కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టాలని వీక్ డేస్ లో మొదటి మూడు రోజు ఎంత వసూళ్లను అయితే రాబట్టిందో..అదే స్థాయి వసూళ్లను రాబట్టాలి..అలా ఒక నెల రోజులు నాన్ స్టాప్ గా ఆడితే సూపర్ హిట్ స్టేటస్ కి చేరుకుంటుంది.

లేకపోతే అధిక రేట్స్ వల్ల ఈ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..మరి అవతార్ పార్ట్ 1 లాంగ్ రన్ గురించి అందరూ కథలు కథలు గా చెప్పుకుంటారు..ఎందుకంటే 12 ఏళ్ళ క్రితమే ఈ సినిమా మూడు బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..ఇప్పటికి ఆ కలెక్షన్స్ ని ముట్టుకున్నా హాలీవుడ్ చిత్రం లేదంటే నమ్మక తప్పదు..ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన సినిమా అది..అయితే ఓటీటీ లకు అలవాటు పడిపోయిన జనాలు ఇప్పుడు అదే రేంజ్ లాంగ్ రన్ ని ఇస్తారా లేదా అనేది చూడాలి..మొత్తం మీద ఈ సినిమా రెండు రోజులకు గాను ఇండియా లో వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా వచ్చింది..ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి..అలాగే నార్త్ అమెరికా లో ఈ చిత్రం రెండు రోజులకు 90 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది..ఇదే ఊపు ని ఫుల్ రన్ వరుకు కొనసాగిస్తుందా లేదా అనేది కూడా చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…