Home Entertainment అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

అవతార్ 2 మొట్టమొదటి రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

1 second read
0
1
960

హాలీవుడ్ మూవీ అవతార్ ఎలాంటి రికార్డులు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టైటానిక్ సినిమా దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈ సినిమాతో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకువెళ్లిపోయాడు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఈ మూవీ ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. అవతార్ 2 కోసం ప్రపంచం మొత్తం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది. డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు ప్రారంభం కాగా కొన్ని నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమా ఎలా ఉన్నా ఈ మూవీని చూడాలని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే అవతార్ ది వే ఆఫ్ వాటర్ మూవీ ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా దర్శకుడు జేమ్స్ క్యామరున్ హింట్ ఇచ్చాడు. తొలి పార్టులో తరహాలోనే పండోరా ప్రపంచాన్ని కాపాడుకోవడానికి హీరో, హీరోయిన్‌లు మనుషులతో పోరాటం చేస్తారని ట్రైలర్ ద్వారా అర్ధమవుతోంది.

వచ్చే నెల రిలీజ్ అయ్యే ఈ సినిమా మొదటి రివ్యూ ఇప్పుడే వచ్చేసింది. ఇచ్చింది కూడా అల్లాటప్పా వ్యక్తి కాదు ఆస్కార్ గ్రహీత.. దర్శకుడు గిల్లెర్మో డెల్ టోరో. ఆయన ఇప్పటికే అవతార్ 2 సినిమాను వీక్షించారట. ఇది అత్యద్భుతమైన విజయం.. గంభీరమైన భావోద్వేగాలతో కూడుకున్న గొప్ప సినిమా అని ఆయన ఈ మూవీని ఆకాశానికి ఎత్తేశాడు. అవతార్ 2 సినిమా తనను పురాణ ఇతిహాసాన్ని చూస్తున్నంతగా ఉక్కిరిబిక్కిరి చేసిందన్నారు. జేమ్స్ కామెరూన్ రాజా ముద్ర, ఆమోద ముద్ర అన్నట్లు టాగ్స్ పెట్టాడు. అవతార్2 మూవీ ఎమోషన్స్‌తో కూడుకున్న గొప్ప మూవీ అని వివరించాడు. దీంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండనుందో అభిమానులు ఉహించుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్.. ఇంకో డైరెక్టర్ గురించి, ఆ సినిమా గురించి ఈ విధంగా మాట్లాడాడు అంటే ఆ సినిమాలో ఉన్న సత్తా అలాంటిదని సోషల్ మీడియాలో నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. అవతార్ 2 మొత్తం నీటి అడుగు భాగంలో జరుగుతుంది. దీంతో ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఇక కథ విషయానికి వస్తే హీరో జేక్ సల్లీ, హీరోయిన్ నేత్రి తమ ప్రపంచం పండోరాలో హాయిగా గడుపుతుంటారు. తొలి భాగం చివర్లోనే నేత్రి గర్భవతి అని హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్‌లో కూడా నేత్రిని గర్భవతిగా చూపించారు. జేక్‌, ఆయన భార్య నేత్రి, పిల్లలు వీరంతా కలిసి పండోరా ప్రపంచానికి కాపాడుకోవడానికి సాహసాలు చేస్తారు. అవతార్‌ పార్ట్‌-1 తరహాలో పండోరా గ్రహం మీద పనిచేసిన రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ సెకండ్‌ పార్ట్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈసారి కొత్త రకమైన రోబోటిక్‌ మిషిన్స్‌తో ఆర్డీఏ నావి తెగ మీద అధికారాన్ని చెలాయించాలని చూస్తుంది. నావీ తెగకు చెందినవారిని ఆర్డీఏ బంధిస్తుంది. వారి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుంది. నావీ తెగను ఎదిరించడానికి హీరో జేక్‌ సల్లీ.. మెట్‌ కానియా తెగ సహాయం తీసుకుంటాడు. మరి మెట్‌ కానియా తెగ హీరో కుటుంబానికి ఎలాంటి సాయం అందించిందో సినిమాలోనే చూడాలి. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇప్పుడు ఈ రివ్యూతో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనాన్ని చూడొచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…