
ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన రాజమౌళి #RRR చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన ప్రభంజనం ని ఇప్పట్లో ఎవ్వరు మర్చిపోలేరు..మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని బాషలలో ఘానా విజయం సాధించి దాదాపుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి ఆల్ టైం టాప్ 3 మూవీ గా నిలిచింది..ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్స్ గా అవతరించారు..థియేటర్స్ లో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..ఇక OTT లో విడుదలైనా తర్వాత అంతకు మించి పది రేట్లు ఎక్కువ విజయం సాధించింది అనే చెప్పాలి..ఈ సినిమా హిందీ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాకి అపూర్వమైన ఆదరణ దక్కింది..కేవలం ఇండియా వాళ్ళు మాత్రం కాదు..ఇతర దేశాల నుండి ప్రేక్షకులు ఈ సినిమాని ఎగబడి మరి చూస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా అల్ టైం హైయెస్ట్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఇక పశ్చిమ దేశాలకు చెందిన ప్రేక్షకులు ఈ సినిమాని చూసి అందులో నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు..ట్విట్టర్ లో ఎక్కడ చూసిన వీళ్ళిద్దరిని ఫారిన్ ఆడియన్స్ పొగడ్తలతో ముంచి ఎత్తే ట్వీట్స్ ఎక్కువగా కనిపిస్తాయి..ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి అయితే హాలీవుడ్ హీరో రేంజ్ ప్రశంసలు వస్తున్నాయి..హాలీవుడ్ లో బిలియన్ డాలర్లు వసూలు చేసిన సినిమాలు తీసిన టెక్నిషియన్స్ కూడా రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు..ఇటీవలే మార్వెల్ స్టూడియోస్ ‘ల్యూక్ కేజ్’ సిరీస్ దర్శకుడు రామ్ చరణ్ ని ప్రశంసలతో ముంచి ఎత్తాడు..ఇతను జేమ్స్ బాండ్ సినిమాలకు సరిగ్గా సరిపోతాడు..హాలీవుడ్ దర్శక నిర్మాతలు కచ్చితంగా రామ్ చరణ్ తో జేమ్స్ బాండ్ మరియు సూపర్ హీరో తరహా సినిమాలు చెయ్యాలి అంటూ ఒక ట్వీట్ వేసాడు..ఇప్పుడు అవతార్ సినిమాని తెరకెక్కించిన జేమ్స్ కామెరాన్ కూడా రామ్ చరణ్ కి ప్రత్యేకంగా ఫోన్ చేసి అద్భుతంగా నటించావు అంటూ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేసాడట.
ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..ఇక సోషల్ మీడియా లో అభిమానులు మరియు కొన్ని వెబ్ సైట్స్ అయితే రామ్ చరణ్ తో జేమ్స్ కామెరాన్ సినిమా అంటూ ప్రచారాలు చెయ్యడం ప్రారంభించేసారు..అయితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలీదు కానీ..రామ్ చరణ్ కి హాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ చూస్తుంటే కచ్చితంగా హాలీవుడ్ లోకి ఎంట్రీ కంఫర్మ్ లాగానే అనిపిస్తుంది..ఇటీవలే మన సౌత్ యాక్టర్ ధనుష్ హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..రూసో బ్రదర్స్ తెరకెక్కించిన ‘ది గ్రే మ్యాన్’ అనే నెట్ ఫ్లిక్స్ మూవీ లో ధనుష్ ఒక్క ముఖ్య పాత్ర పోషించాడు..ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి కూడా రూసో బ్రదర్స్ ని కలవడం జరిగింది..రూసో బ్రదర్స్ నిర్మాణ సారథ్యం లో రాజమౌళి దర్శకత్వం లో ఒక్క భారీ బడ్జెట్ హాలీవుడ్ సినిమాని తెరకెక్కించడానికి చర్చలు జరుగుతున్నాయి అట..ఈ చిత్రం లో రామ్ చరణ్ హీరో గా నటించబోతున్నట్టు తెలుస్తుంది..ఇదే వార్త కనుక నిజమైతే రామ్ చరణ్ పాన్ వరల్డ్ లెవెల్ స్టార్ అవ్వడం లో ఎలాంటి సందేహం లేదు..ఇటీవలే ధనుష్ కూడా హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు రామ్ చరణ్ మరియు ప్రభాస్ తో భారీ సినిమాలు తియ్యడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పాడు..బహుశా ఆ సినిమా ఇది కూడా కావొచ్చు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.