Home Entertainment అల్లు అర్జున్ హిట్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ని మిస్ చేసుకున్న నిహారిక..ఆ సినిమా ఏమిటో తెలుసా?

అల్లు అర్జున్ హిట్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ని మిస్ చేసుకున్న నిహారిక..ఆ సినిమా ఏమిటో తెలుసా?

0 second read
0
0
907

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగా ఫామిలీ కి ఉన్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ..ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన మెగాస్టార్ ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా నెంబర్ 1 హీరో గా సుమారు మూడు దశాబ్దాల నుండి కొనసాగుతూనే ఉన్నాడు..ఇక ఆయన అడుగుజాడల్లో మెగా ఫామిలీ నుండి వచ్చిన హీరోలు అత్యధిక శాతం ఇండస్ట్రీ లో సక్సెస్ అయ్యారు..అయితే అదృష్టం కలిసిరాక సక్సెస్ కానీ వారు కూడా ఉన్నారు..వారిలో నాగబాబు,అల్లు శిరీష్ , కళ్యాణ్ దేవ్ లతో పాటు నిహారిక కొణిదెల కూడా ఉన్నది..ఈమె హీరోయిన్ గా ‘ఒక మనసు’,’హ్యాపీ వెడ్డింగ్’ మరియు సూర్యకాంతం వంటి సినిమాల్లో నటించింది..కానీ ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదు..కనీసం ఈ సినిమాలు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్లిందో అనే విషయం మెగా అభిమానులకు కూడా తెలియదు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇక మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం లో ఒక చిన్న పాత్ర పోషించింది..ఆ సినిమా పెద్ద హిట్ అయినా కూడా ఈమెకి వచ్చిన గుర్తింపు ఏమి లేదు.

ఇక ఆ తర్వాత ఈమె వెబ్ సిరీస్ లు చేసుకుంటూ వస్తుంది..వెబ్సెరీస్ లో కూడా ఈమె నటించినవి తుస్సుమన్నాయి..ఇక తర్వాత నటన కి బ్రేక్ ఇచ్చి ప్రొడక్షన్ హౌస్ ప్రారంబించి వెబ్ సిరీస్ లను నిర్మించడం ప్రారంభించింది..నటిగా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా నిర్మాతగా మాత్రం ఈ సక్సెస్ సాధించింది అనే చెప్పాలి..ఇటీవలే ఈమె నిర్మాణ సారథ్యం లో తెరకెక్కిన ‘ఒక చిన్న ఫామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ కి మంచి రివ్యూస్ వచ్చాయి..ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ 5 యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది..ఇది ఇలా ఉండగా నిహారిక కొణిదెల గురించి మనకెవ్వరికి తెలియని ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది..అదేమిటి అంటే ఈమె అల్లు అర్జున్ హీరో గా నటించిన ఒక బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ రోల్ ని చేతులారా మిస్ చేసుకుంది..ఇంతకు ఆ సినిమా మరేదో కాదు..అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు చిత్రం.

అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే..అల్లు అర్జున్ ని మాస్ హీరోగా నిలబెట్టింది ఈ చిత్రం..ఈ సినిమాలో హీరోయిన్స్ గా రకుల్ ప్రీత్ సింగ్ మరియు కాథరిన్ తెరిసా నటించారు..అప్పట్లోనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని వసూలు చేసింది..ఇంతతి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా ఈ సినిమాలో తొలుత హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్నది మన నిహారికనే అట..ఈ విషయం ని స్వయంగా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ తెలిపాడు..నాగబాబు గారు నిహారిక ని ఇండస్ట్రీ లో హీరోయిన్ గా పరిచయం చెయ్యబొయ్యే సంగతి నాకు ముందుగా చెప్పలేదు..ఒకవేళ ముందే చెప్పి ఉంటె సరైనోడు సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కేది అంటూ అల్లు అరవింగ్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఒకవేళ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసి అది వర్కౌట్ అయ్యి ఉంటె కచ్చితంగా హీరోయిన్ సక్సెస్ సాధించి ఉండేదేమో అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…