
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్‌లో అగ్రహీరోగా దూసుకుపోతున్నాడు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమా అల్లు అర్జున్ క్రేజ్‌ను అమాంతం పెంచేసింది. ఈ మూవీ బన్నీ మార్కెట్‌ను పెంచింది. దీంతో ఇప్పుడు అతడు నటించనున్న పుష్ప-2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ వ్యక్తిగత జీవితం గురించి కూడా అందరికీ తెలుసు. అతడి భార్య స్నేహారెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి. సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ సంగతులు, తన పిల్లల అల్లరిని పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది. ముఖ్యంగా బన్నీతో కలిసి ఎక్కడికి వెళ్లినా ఆ టూర్ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇంట్లో పండగలు జరిగిన సమయంలోనూ పిల్లలకు సంబంధించిన అప్ డేట్ల గురించి స్నేహారెడ్డి పోస్ట్ చేస్తుంటుంది. బన్నీకి తగ్గట్లుగానే స్నేహారెడ్డి కూడా తన కాస్ట్యూమ్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వీళ్ల కపుల్‌ను స్టైలిష్ కపుల్ అని అభిమానులు పిలుస్తుంటారు.
అయితే స్నేహారెడ్డికి టాలీవుడ్‌లో ఒక హీరోయిన్ అంటే అసలు ఇష్టం ఉండదని ఫిలింనగర్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది. ఆమె ఎవరో కాదు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు అగ్రహీరోలతో వరుసగా నటించిన రకుల్ ఇటీవల అవకాశాలు లేక ఇతర భాషల్లో నటిస్తోంది. అల్లు అర్జున్‌తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ఒకే ఒక సినిమాలొ నటించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సరైనోడు మూవీలో రకుల్ బన్నీ సరసన ఆడిపాడింది. అయితే ఈ మూవీలో నటించిన సమయంలో అల్లు అర్జున్‌తో రకుల్ రాసుకుని పూసుకుని తిరగడం స్నేహాకు నచ్చలేదట. దీంతో అప్పటి నుంచి రకుల్ పట్ల ఆమె ద్వేషాన్ని ప్రదర్శిస్తోందని టాక్ నడుస్తోంది. సరైనోడు మూవీలో బన్నీ, రకుల్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆఫ్ స్క్రీన్‌లోనూ బన్నీతో క్లోజ్‌గా ఉండేందుకు రకుల్ ప్రయత్నించేది. బన్నీని తరచూ కలిసేందుకు ప్రాధాన్యం ఇచ్చేది. ఒకరోజు బన్నీ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న సమయంలో రకుల్ ఫోన్ చేసింది. చాలాసేపు ఆమెతో బన్నీ ఫోన్ మాట్లాడటాన్ని గమనించిన స్నేహా అగ్గి మీద గుగ్గిలంగా మారి ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసిందట.
మరోవైపు రకుల్ ప్రీత్‌సింగ్ మంచు ఫ్యామిలీతోనూ ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మీతో ఆమె సాన్నిహిత్యంగా ఉండటం చూసి చాలా మంది పలురకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. ఒక దశలో మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్‌సింగ్ లెస్బియన్‌లు అని కూడా ప్రచారం సాగింది. రకుల్, మంచు లక్ష్మీ కలిసి టూర్లకు కూడా వెళ్లారు. ఇంకా పెళ్లి చేసుకోని రకుల్ ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తిరుగుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ పోస్ట్ చేస్తుంటుంది. వచ్చే ఏడాది రకుల్ పెళ్లిపీటలు ఎక్కడం ఖాయమని ప్రచారం సాగుతోంది. అటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. తాను ప్రేమించిన స్నేహా రెడ్డిని ఇంట్లో పరిచయం చేసి బన్నీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ల వివాహం మార్చి 6, 2011న జరిగింది. వీరి పెళ్లి జరిగి 11 ఏళ్లు పూర్తయ్యింది. ప్రస్తుతం బన్నీ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. కాగా బన్నీతో అతిగా తిరిగి రకుల్ ప్రీత్ సింగ్ అనవసరంగా బ్యాడ్ అయ్యిందేమో అని సినిమా జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.