
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నేటి తరం హీరోలలో మంచి టాలెంట్ ఉన్న హీరో ఎవరు అంటే మనకి టక్కుమని గుర్తుకువచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..మెగాస్టార్ చిరంజీవి అల్లుడిగానే ఆయన ఇండస్ట్రీ లో అడుగుపెట్టాడు..తోలి సినిమాలో లుక్స్ పరంగా అందరిని షాక్ కి గురి చేసినప్పటికీ కూడా టాలెంట్ విషయం లో సూపర్ అనిపించుకున్నాడు..చిరంజీవి దాడి సినిమాలోనే ఒక చిన్న పాత్ర ద్వారా వెండితెర అరంగేట్రం చేసి తన డాన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు..ఇక గంగోత్రి సినిమాతో పూర్తి స్థాయి హీరో గా డెబ్యూ చేసి తోలి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్నాడు..ఇక తర్వాత ఆయన నటించిన ఆర్య సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన బన్నీ అనే సినిమా కూడా హిట్టే..అలా వరుసగా హిట్ మీద హిట్ కొడుతూ ఒక్కో మెట్టు ఎదుగుతూ స్టార్ హీరో గా ఎదిగాడు..కానీ ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా ఆయన చిరంజీవి పేరు చెప్పుకునే ఇండస్ట్రీ కి వచ్చాడు అనే విషయం మన అందరికి తెలిసిందే.
అల్లు అర్జున్ కూడా నిన్న మొన్నటి వరుకు కూడా చిరంజీవి గారు వేసిన ప్లాటుఫారం లోనే మేమంతా నడిచి స్టార్ హీరోలయ్యాము అంటూ చెప్పుకునేవాడు..కానీ ఇటీవల కాలం లో అల్లు అర్జున్ ప్రవర్తన చూస్తుంటే ఆయన మెగా ఫామిలీ నుండి బయటకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన లీగ్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు..నిన్న మొన్నటి వరుకు మేము మెగా ఫామిలీ లో ఒకరు అను చెప్పుకుంటూ వచ్చిన అల్లు అర్జున్..ఇప్పుడు మెగా ఫామిలీ ని పక్కన పెట్టి అల్లు ఫామిలీ అంటూ చెప్పుకోవడం ప్రారంబించాడు..నిన్న ఆయన ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ పెను దుమారమే రేపింది..అల్లు రామలింగయ్య గారి ఫోటో పెట్టి మా ఫౌండేషన్ అంటూ వేసిన ఒక ట్వీట్ తెగ వైరల్ గా మారింది..అల్లు అర్జున్ సక్సెస్ లో ఉండేలోపు తన రూట్స్ ని విలువలని మర్చిపోయ్యాడని..ఆయన వచ్చింది చిరంజీవి గారి అల్లుడిగా అనే విషయం పూర్తిగా విస్మరించాడని..ఇదేమి నక్క బుడ్డి అంటూ మెగా ఫాన్స్ అల్లు అర్జున్ ని ట్విట్టర్ లో బండబూతులు తిడుతున్నారు.
సరైనోడు సినిమా నుండి అల్లు అర్జున్ ఇలానే ప్రవర్తిస్తున్నాడని..ఎదిగే వరుకు మెగా ఫామిలీ ఫాన్స్ కావాలి కానీ..ఎదిగిన తర్వాత వాళ్ళు అక్కర్లేదు..వాళ్ళ పేర్లు చెప్పుకోడానికి కూడా మనసు రాదంటూ అల్లు అర్జున్ ని తిట్టిపోస్తున్నారు మెగా అభిమానులు..అల్లు అర్జున్ సినిమాలను ఇన్ని రోజులు మేము మెగా హీరో అని మాత్రమే చూసాము..ఇప్పటికి కూడా మెగా హీరో అనుకొనే ఆయనకీ బ్యానెర్లు వెయ్యిస్తున్నాము ఆయన సినిమాలు చూస్తున్నాము..కానీ ఆయన ప్రవర్తన ఇటీవల కాలం లో చాలా తేడాగా ఉంది అంటూ అల్లు అర్జున్ పై అభిమానులు విరుచుకుపడుతున్నారు..మరో పక్క అల్లు అర్జున్ ఫాన్స్ నుండి వినిపిస్తున్న మాట ఏమిటి అంటే అల్లు రామలింగయ్య గారి పేరు మీద అల్లు అర్జున్ ఒక ఫౌండేషన్ ప్రారంభించాడని..దానికి సంబంధించి ఆయన అలా ట్వీట్ వేసాడే కానీ చిరంజీవి గారిని తక్కువ చేసే ఉద్దేశ్యం లేదని..చిరంజీవి గారు అంటే అల్లు అర్జున్ కి ఎంతో అభిమానం అంటూ చెప్పుకొచ్చారు..అయితే సోషల్ మీడియా లో వస్తున్నా ఈ నెగటివ్ కామెంట్స్ పై అల్లు అర్జున్ స్పందిస్తాడో లేదో చూడాలి.