
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో ఎప్పటికి చెరగని ముద్ర వేసిన హీరో అల్లరి నరేష్, స్వర్గీయ ఈ వీ వీ సత్యనారాయణ కొడుకుగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన అల్లరి నరేష్ కామెడీ సినిమాల హీరో గా ఆయనకీ ఎలాంటి బ్రాండ్ ఇమేజి దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం కామెడీ జానర్ లోనే కాకుండా త్రణలోని అద్భుతమైన నటుడిని ఆవిష్కరించిన గమ్యం,నేను మరియు విశాఖ ఎక్సప్రెస్స్ వంటి సినిమాలు నటుడిగా ఆయనకి ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, 2012 వ సంవత్సరం లో ఈయన చేసిన సుడిగాడు అనే సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ సినిమా తర్వాత ఆయనకీ సరైన సక్సెస్ రాలేదు, కామెడీ జానర్ సినిమాలను కొంతకాలం పక్కన పెట్టి కంటెంట్ ఉన్న సినిమాలు చేసిన పాపం బాడ్ లక్ వల్ల సక్సెస్ కాలేదు, ఇలా పాపం తన పని ఇక కంప్లీట్ గా అయిపోయింది అని అందరూ అనుకుంటున్న సమస్యం లో నాంది అనే సినిమా రూపం లో మంచి సూపర్ హిట్ దక్కింది.
ఫిబ్రవరి 19 వ తేదీన అల్లరి నరేష్ హీరో గా నటించిన నాంది అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే,ఫస్ట్ లుక్ దగ్గర నుండి టీజర్ మరియు ట్రైలర్ దాకా పేక్షకులు అందరిని విశేషంగా ఆకట్టుకొని అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో ఒక్క ప్రత్యేకమైన చిత్రం గా నిలిచిపోతుంది అని అందరూ అనుకున్నారు, ఆ అంచనాలకు తగట్టు గానే ఈ సినిమా తొలి ఆట నుండే ప్రేక్షకుల నుండి అద్భుతంగా రెస్పాన్స్ ని సంపాధించుకుంది, అల్లరి నరేష్ తన అద్భుతమైన నటన తో ఈ సినిమాని ఆద్యతం ఆసక్తిగా చూసేలా చేసాడు అని, ఈ సినిమా లో ఆయన పెర్ఫార్మన్స్ కి గాను కచ్చితంగా అవార్డుల వర్షం కురుస్తుంది అని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు చెప్తున్నాడు,ప్రేక్షకుల నుండి చాల కాలం తర్వాత ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ని చూసిన అల్లరి నరేష్ ఒక్కసారిగా తీవ్రమైన భావోద్వేగానికి లోను అయ్యాడు, నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అల్లరి నరేష్ మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యానికి గురి చేసాయి.
ఆయన మాట్లాడుతూ ‘2012 ఆగష్టు 24 వ తేదీన సుడిగాడు సినిమా విడుదల అయ్యింది, ఈ సినిమానే నా కెరీర్ లో భారీ హిట్, ఆ తర్వాత ఎనిమిది ఏళ్ళు సక్సెస్ కోసం ఎదురు చూడాల్సొచ్చింది( ఏడుస్తూ), ఇంత కాలం నాకు సక్సెస్ లేకపోయినా కూడా మళ్ళీ నేనో మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు నన్ను ఆదరించారు, నాంది సినిమా విజయం నాకు ఎంత సంతృప్తి ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేను, వాస్తవానికి నేను ఎమోషనల్ ఫెలో ని కాదు, కానీ ఎందుకో ఈరోజు నాకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి, నా సినిమాని ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను, ఇది నాకు రెండో ఇన్నింగ్స్ లాంటిది, ఇక నుండి నేను ఇలాంటి సినిమాలే చేస్తాను ‘ అంటూ అల్లరి నరేష్ ఈ సందర్భంగా ఎంతో బావోద్వేగంగా స్పందించారు,ఇక మొదటి ఆట నుండే మంచి టాక్ ని కైవసం చేసుకున్న ఈ చిత్రం తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 50 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసింది, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు కోట్ల 50 లక్షల రూపాయలకు జరిగింది, మరి ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోవాలి అంటే మరో రెండు కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాలి, మరి దీని బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడికి వెళ్తుందో చూడాలి.