
బిగ్ బాస్ సీజన్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా బయటకి వెళ్లిన అతి తక్కువ మందిలో ఒకరు వాసంతి..ప్రారంభం లో కాస్త తడబడినప్పటికీ ఆ తర్వాత నుండి ఆమె తన గేమ్ స్టైల్ ని మార్చుకొని అద్భుతంగా ఆడదానికి ప్రయత్నం చేసింది..కొన్ని సందర్భాలలో ఆమె మగవాళ్ళతో కూడా పోటీ పడీమరీ ఆడింది..ఆమె ఎలిమినేషన్ కూడా అందరికి బాగా బాధ కలిగించింది..కానీ బయటకి వెళ్లిన తర్వాత ఆమెకి సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయి అనుకున్నారు..చూడాలి మరి ఆమె భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..హీరోయిన్ అయ్యే రేంజ్ లక్షణాలు వాసంతి కి పుష్కలంగా ఉన్నాయి..మేకప్ వేసిన మేకప్ తీసిన ఆమె అందం ముందు బిగ్ బాస్ లో మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ్వరు కూడా నిలవలేకపొయ్యారు..ఆధార్ కార్డు లో కూడా ఆమె అందంగా కనిపిస్తుంది అని చెప్పొచ్చు..అయితే హౌస్ ఉన్నప్పుడు లవ్ ట్రాక్స్ నడుపుతారని అందరూ అనుకుంటూ ఉంటారు..కానీ ఆమె హౌస్ లో ఉన్నప్పుడు కేవలం కంటెస్టెంట్ గా మాత్రమే తన హద్దులో నడుచుకుంది.
కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆమె అర్జున్ కళ్యాణ్ తో లవ్ ట్రాక్ నడిపేటట్టు గా అనిపిస్తుంది..హౌస్ నుండి బయటికి వచ్చాక వీళ్లిద్దరు చాలా సార్లు ఇంస్టాగ్రామ్ లో లైవ్ గా మాట్లాడుకున్నారు..బయట కూడా చాలా సార్లు కలిసి తిరిగారు..ఇక రీసెంట్ గా ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ‘ఆదివారం రోజు స్టార్ మా పరివారం’ అనే కార్యక్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరూ హాజరయ్యారు..వీళ్ళతో బిగ్ బాస్ లో ఆడించిన గేమ్స్ ని ఆడించారు..ఈ కార్యక్రమం లో అర్జున్ కళ్యాణ్ , వాసంతి ,ఆరోహి, సూర్య , చంటి , గీతూ రాయల్ , బాలాదిత్య తదితరులు పాల్గొన్నారు..వీరిలో ఈ షో కి హైలైట్ గా నిలిచింది వాసంతి మరియు అర్జున్ కళ్యాణ్ జంట..అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.
ఇక అసలు విషయానికి వస్తే కాకరకాయ జ్యూస్ ని తాగాల్సిందిగా వాసంతి కి యాంకర్ శ్రీముఖి ఛాలెంజ్ చేస్తుంది..అయితే వాసంతి అది తగలేక అర్జున్ కళ్యాణ్ ని పిలిచి నాకోసం తాగుతావా ఇది అని అడుగుతుంది..అర్జున్ కళ్యాణ్ తాగుదామా వద్దా అని ఆలోచిస్తుండగా వాసంతి మాట్లాడుతూ ‘అంతేలే..నాకోసం ఎందుకు తాగుతావు..అదే శ్రీ సత్య అడిగితె పరిగెత్తుకుంటూ వచ్చి తాగుతావు’ అని అంటుంది..అప్పుడు అర్జున్ కళ్యాణ్ పైకి లేచి వచ్చి వాసంతి కోసం కాకరకాయ జ్యూస్ ని తాగుతాడు..అప్పుడు వాసంతి అర్జున్ కళ్యాణ్ ని దగ్గరకి తీసుకొని బుగ్గ కందిపొయ్యే రేంజ్ లో గట్టిగా ముద్దుపెడుతుంది..అది చూసి అక్కడున్న వాళ్ళందరూ షాక్ కి గురి అవుతారు..వాసంతి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం అర్జున్ కళ్యాణ్ తో మాత్రమే కాదు..మిగిలిన మగ కంటెస్టెంట్స్ అందరితో హద్దులు దాటి ఎప్పుడు ప్రవర్తించలేదు..కనీసం ఆమె హగ్ ఇచ్చిన దాఖలాలు కూడా లేవు..అలాంటిది ఇక్కడ ఏకంగా ఆ రేంజ్ లో ముద్దుపెట్టేసరికి అర్జున్ కళ్యాణ్ కూడా షాక్ కి గురైయ్యాడు.