
బుల్లితెర పై కొన్ని సీరియల్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంటాది, వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు టీవీలకు అతుక్కుపొయ్యి చూసిన సీరియల్స్ చేతి వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు, అలాంటి సీరియల్స్ లో ఒక్కటి అమృతం, ఈ సీరియల్ అప్పట్లో ఎలాంటి సెన్సషనల్ హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, దాదాపు 7 సంవత్సరాలు విరామం లేకుండా ప్రసారం అయినా ఏకైక కామెడీ సీరియల్ ఇదే, ఈ సీరియల్ లో అమృతరావు క్యారక్టర్ ని శివాజీ రాజా , నరేష్ మరియు హర్ష వర్ధన్ ఇలా ముగ్గురు సీసన్స్ వారీగా పోషించారు, అయితే వీరి ముగ్గురిలో హర్ష వర్ధన్ నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి, ఈ సీరియల్ ద్వారా ఆయనకీ కలలో కూడా ఊహించని పాపులారిటీ మరియు క్రేజ్ వచ్చింది, అయితే హర్షవర్ధన్ గురించి ఇటీవల బయటపడ్డ కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, అవి ఏమిటో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
హర్ష వర్ధన్ కి దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న సంబంధం గురించి ఇటీవల ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు, ఆయన మాట్లాడుతూ ‘ నేను రాజమౌళి గారు అప్పట్లో దర్శకత్వం వహించిన శాంతినివాసం అనే సీరియల్ కి నేను రైటర్ గా పని చేశాను, నా రైటింగ్ స్కిల్స్ అంటే రాజమౌళి గారికి ఎంతో ఇష్టం, దాదాపు 15 ఎపిసోడ్స్ కి పైగా ఆయన నాతో డైలాగ్స్ రాయించడమే కాకుండా, నాకోసం ఒక్క ప్రత్యేకమైన పాత్రని కూడా అద్భుతంగా డిసైన్ చేసారు, ఆ పాత్రకి నాకు ఎంతో పేరు వచ్చింది, శాంతినివాసం సీరియల్ చేస్తున్న సమయం లోనే ఆయనకీ స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది, శాంతి నివాసం సీరియల్ మరియు స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఈ రెండిటికి రాఘవేంద్ర రావు గారే నిర్మాత, రాజమౌళి గారు శాంతి నివాసం సీరియల్ దిరెచ్తిఒన్ బాధ్యతలు నాకు అప్పగించి , ఆయన సినిమాల్లోకి వెళ్లిపోయారు’ అంటూ చెప్పుకొచ్చారు హర్ష వర్ధన్.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ రాజమౌళి గారు అకస్మాత్తుగా నాకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించేసరికి నాకు ఏమి చెయ్యాలో అర్థం కాలేదు , నాకేమో డైరెక్షన్ లోన్ అ ఆ లు కూడా తెలియవు, నా మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టేసరికి నేరుగా రాజమౌళి గారి దగ్గరకి వెళ్లి డైరెక్షన్ ఎలా చెయ్యాలి సర్ నాకేం తెలియదు అని అడిగాను, ఏమి కాదు నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పి ఆయన వెళ్లిపోయారు, నేను నేరుగా రాజీవ్ కనకాల దగ్గరకి వెళ్లి అసలు డైరెక్షన్ అంటే ఏమిటి , ఎలా చెయ్యాలి అని అడిగాను, ఆరోజు నాకు వాడు నేర్పించిన ఆ అరగంట దర్శకత్వ టెక్నిక్స్ నాకు ఈరోజు వరుకు పనికి వచ్చాయి , రాజీవ్ కనకాల లో ఒక్క గొప్ప డైరెక్టర్ ఉన్నాడు, కానీ ఎందుకో బయటపెట్టట్లేదు, కస్తూరి సీరియల్ లో వాడు కొన్ని ఎపిసోడ్స్ కి డైరెక్షన్ చేసాడు, ఆ ఎపిసోడ్స్ ని చూస్తే అసలు సీరియల్ లాగానే అనిపించాడు , అంత అద్భుతంగా తీసాడు ‘ అంటూ చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్.