
బాహుబలి వంటి సెన్సషనల్ హిట్ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుతం #RRR చిత్రం ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..విడుదలైన అన్ని బాషలలో కూడా ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం టాప్ 3 ఇండియన్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది..ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి పాన్ వరల్డ్ స్టార్స్ గా గుర్తింపు లభించింది..థియేట్రికల్ పరంగా ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ ని సాధించిందో..OTT లో విడుదలైన తర్వాత అంతకు మించి సక్సెస్ ని సాధించి హాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల దృష్టిని కూడా ఆకర్షించింది..నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా దాదాపుగా 13 వారల నుండి ట్రెండ్ అవుతూనే ఉంది.
ఇక పోతే ఇటీవల కాలం లో ఈ సినిమాలో కొమురం భీం పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ ని ఒక ప్రఖ్యాత హాలీవుడ్ మ్యాగజైన్ ‘వెరైటీ’ అనే సంస్థ ఎన్టీఆర్ కి ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు నామినేషన్స్ కి వెళ్లే అవకాశం ఉందంటూ ఒక్క ఆర్టికల్ రాసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వార్త ఇప్పుడు మీడియా లో ప్రకంపనలు రేపింది..ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ కి వెళ్లబోయ్యే మొట్టమొదటి ఇండియన్ నటుడిగా ఎన్టీఆర్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడా? అంటూ ప్రత్యేక కథనాలు కూడా రావడం మొదలైయ్యాయి..ఈ స్థాయిలో పాపులారిటీ రావడం తో ఎన్టీఆర్ ని నిన్న రాత్రి అమిత్ షా గారు ప్రత్యేకంగా డిన్నర్ కి ఆహ్వానించినా సంఘటన అటు రాజకీయ వర్గాల్లోనూ..ఇటు సినీ పరిశ్రమలోనూ ప్రకంపనలు రేపింది..అసలు ఎందుకు అమిత్ షా ఎన్టీఆర్ ని కలిసాడు అనే దానిపై సోషల్ మీడియా లో రకరకాల చర్చలు మొదలయ్యాయి..తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎన్టీఆర్ పై విమర్శలు చెయ్యడం ప్రారంభించారు.
అయితే TDP కార్యకర్తల్లో ఏర్పడిన ఈ సందిగ్ధం ని దూరం చేస్తూ ఎన్టీఆర్ మాట్లాడిన లేటెస్ట్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ఆయన మాట్లాడుతూ ‘నిన్న అమిత్ షా గారిని కలవడం పై సోషల్ మీడియా లో వస్తున్న కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి..మా మీటింగ్ కి రాజకీయానికి ఎలాంటి సంబంధం లేదు..ఇటీవలే అమిత్ షా గారు #RRR చిత్రాన్ని చూసారు..ఈ సినిమా చూసిన తర్వాత ఆయన నాకు ప్రత్యేకంగా కాల్ చేసి అభినందనలు తెలిపాడు..ఆ తర్వాత ఒకసారి హైదరాబాద్ కి వచ్చిన తర్వాత కలుద్దాం అన్నారు..నిన్న హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్ నోవెటల్ కి నన్ను డిన్నర్ కి ఆహ్వానించారు..వెళ్లి మర్యాదపూర్వకంగా అమిత్ షా గారిని కలిసి వచ్చాను..ఆయనతో గడిపిన ఆ కాసేపు నాకు గొప్ప అనుభూతిని కలిగించింది..ఇది కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమే..దయచేసి దీనికి రాజకీయ రంగులు పులమొద్దు’ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా అభిమానులకు పిలుపుని ఇచ్చాడు.