Home Entertainment అభిమానుల ఆందోళన పై తొలిసారి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

అభిమానుల ఆందోళన పై తొలిసారి స్పందించిన జూనియర్ ఎన్టీఆర్

0 second read
0
0
7,937

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సునామి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా తో అటు ఎన్టీఆర్ ని ఇటు రామ్ చరణ్ ని పాన్ ఇండియా లెవెల్ లో తిరుగు లేని స్టార్ హీరోలు నిలబెట్టింది అని చెప్పొచ్చు , ముఖ్యంగా వీళ్లిద్దరి నటన కి జనాలు జేజేలు పలుకుతున్నారు , అయితే ఈ సినిమాలో ఇద్దరి హీరోలను ఫస్ట్ హాఫ్ లో సమానంగానే చూపించినప్పటికీ, సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా స్టోరీ మొత్తం పూర్తిగా రామ్ చరణ్ వైపు వెళ్ళిపోయింది అని, మా జూనియర్ ఎన్టీఆర్ ని బాగా తగ్గించేశారు అని, ముఖ్యంగా ఆఖరి 40 నిముషాలు మొత్తం పూర్తి స్థాయి రామ్ చరణ్ ని ఒక్క రేంజ్ లో ఎలివేట్ చేసి రాజమౌళి ఎన్టీఆర్ ని తేలిపొయ్యేలా చేసాడు అని నందమూరి అభిమానులు రాజమౌళి పై ఫైర్ అయ్యారు, ఈ సినిమాని చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు అనే అనాలి.

అయితే సోషల్ మీడియా లో తరుచు వస్తున్నా ఈ వార్తలు జూనియర్ ఎన్టీఆర్ ద్రుష్టి దాకా వెళ్లాయి, ఇటీవల ఆయన ఇచ్చిన ఒక్క ఇంటర్వ్యూ లో అభిమానులు మీ పాత్ర బాగా తగ్గింది అని ఫీల్ అవుతున్నారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెప్తూ ‘నా జీవితం ని , నా సినీ కెరీర్ ని ఆర్ ఆర్ ఆర్ తర్వాత మరియు ఆర్ ఆర్ ఆర్ ముందు లాగ విభజించవచ్చు, నాకు అత్యంత సంతృప్తి ఇచ్చిన పాత్రలలో ఒక్కటి కొమరం భీం, పాన్ ఇండియా లెవెల్ లో నా నటన ని మరియు నా బ్రదర్ చరణ్ నటనని అందరూ చూసి మెచ్చుకుంటూ ఉంటె నాకు నోటి నుండి మాటలు రావడం లేదు, ఈ సినిమా నాకు ఎంతో మేలు చేసింది అనే గట్టిపోగా నమ్ముతున్నాను, ఇక అభిమానులు నా పాత్ర తగ్గింది అని అనవసరంగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, సినిమా చూస్తునంతసేపు అయితే నాకు మా ఇద్దరి పాత్రలను జక్కన సరిసమానంగా చూపించాడు అనే ఫీలింగ్ మాత్రమే ఉంది, రామరాజు కి భీం గురువు అయ్యాడు , భీం కి రామరాజు గురువు అయ్యాడు, ఇందులో ఎవరు గొప్ప ఎవరు తక్కువ, దయచేసి సినిమాని సినిమాలాగే చూసి అభిమానులందరూ ఎంజాయ్ చెయ్యాలి, ఇలాంటి సినిమాలు తరుచురావు’ అంటూ సమాధానం ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్.

ఇది ఇలా ఉండగా త్వరలోనే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ కి పార్ట్ 2 తియ్యబోతున్నాడు అనే వార్తలు సోషల్ మీడియా లో గత కొద్దీ రోజుల నుండి ప్రచారం సాగుతుంది, ఈ విషయం గురించే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల జరిగిన ఒక్క ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ‘ సినిమా భారీ సక్సెస్ అయినా తర్వాత ఎన్టీఆర్ మా ఇంటికి వచ్చాడు, ఆర్ ఆర్ ఆర్ మూవీ కి పార్ట్ 2 చేస్తే ఎలా ఉంటుంది అనే దానిపై చర్చలు జరిపాము, కొన్ని ఐడియాస్ అనుకున్నాము, అవి చాలా బాగున్నాయి, దేవుడు సంకల్పిస్తే కచ్చితంగా పార్ట్ 2 తీస్తాము’ అని చెప్పుకొచ్చాడు, మరి పార్ట్ 2 లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఎలా చెలరేగిపొయ్యి చేస్తారు అనేది చూడాలి,ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే, ఈ సినిమా పూర్తి అయినా తర్వాతనే ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 మొదలయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది, బాహుబలి పార్ట్ 2 లాగానే ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 కూడా అదే స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

చిరంజీవి ఇంట్లో బాలయ్య బాబు సినిమా షూటింగ్..షాక్ లో ఫాన్స్

మన టాలీవుడ్ లో చిరంజీవి మరియు బాలకృష్ణ కి ఎలాంటి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా…