Home Entertainment అభిమానులను శోకసంద్రం లో ముంచేసిన సుడిగాలి సుధీర్..అసలు ఏమి జరిగింది?

అభిమానులను శోకసంద్రం లో ముంచేసిన సుడిగాలి సుధీర్..అసలు ఏమి జరిగింది?

0 second read
0
0
1,639

తెలుగు బుల్లితెర పై పరిచయం అయ్యి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న అతి కొద్దిమంది లో ఒక్కరు సుడిగాలి సుధీర్, జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రారంభం అయినా ఈయన కెరీర్ ప్రస్తుతం ఎలాంటి పీక్ స్థానం లో ఉన్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు , ఆయన లేనిదే ఈటీవీ లో ఎంటర్టైన్మెంట్ ప్రొగ్రమ్ లేదు అనే స్థాయిలో సుధీర్ రేంజ్ పెరిగిపోయింది, ఈటీవీ వారు కూడా సుధీర్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయనని పూర్తి స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి వాడుకుంటూ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని సాధిస్తున్నారు, ఇక బుల్లితెర మీద మెగాస్టార్ రేంజ్ కి చేరిన సుడిగాలి సుధీర్ కి సినిమాల్లో కూడా అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి, కొన్ని సినిమాల్లో ఆయన హీరో గా చేస్తుండగా మరికొన్ని సినిమాల్లో కమెడియన్ గా నటిస్తూ ఒక్క పక్క సినిమాలు మరో పక్క ఎంటెర్టైమెంట్ షోలు చేసుకుంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు ఆయన, తానూ కెరీర్ పరంగా ఎంత బిజీ గా ఉన్నప్పటికీ జబర్దస్త్ షో ని మాత్రం ఆయన ఇప్పటి వరుకు వదలలేకపొయ్యాడు.

జబర్దస్త్ షో తో పాటుగా ఆయన ఢీ డాన్స్ షో లో ఒక్క టీం లీడర్ గా గత నాలుగు సీసన్స్ నుండి కొనసాగుతున్నాడు,ఢీ షో తో పాటుగా ఈటీవీ వారు నిర్వహించే పండగ స్పెషల్ ప్రోగ్రామ్స్ లోను, అలాగే ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోను పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు,అయితే ఇప్పుడు సినిమాల్లో ఆయనకీ కమెడియన్ గా ఊపిరి సలపనంతా బిజీ గా ఉన్నాడు, దీనితో ఈటీవీ లో ప్రసారం అయ్యే షోస్ లో ఎదో ఒక్క షో కి గుడ్బై చెప్పబోతున్నాడు అని ఎంతో కాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది, అనుకున్నట్టే ఆయన ఢీ లేటెస్ట్ సీసన్ డ్యాంసింగ్ ఐకాన్స్ షో కి గుడ్ బాయ్ చెప్పేసాడు,ఇటీవల ప్రారంభం అయినా ఈ షో లో సుడిగాలి సుధీర్ కనపడలేదు, ఆయనకీ బదులుగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ టీం లీడర్ గా వచ్చాడు, ఇక ప్రత్యర్థి టీం లీడర్ గా హైపర్ ఆది కొనసాగుతున్నాడు, సుధీర్ తో పాటుగా రష్మీ కూడా ఈ షోలో కనపడలేదు, వీళ్లిద్దరు లేని ఢీ షో ని చూస్తే ఎదో మిస్ అయినా ఫీల్ వచ్చేస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు, వాస్తవానికి ఢీ షో ని డాన్స్ కోసం చూసే వాళ్ళు కొంతమంది అయితే, సుధీర్ కామెడీ కోసం చూసే వాళ్ళు ఇంకా ఎక్కువ , ఇప్పుడు సుధీర్ ఇక ఢీ షో లో లేదు అనే వార్తని ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఇక సుధీర్ జబర్దస్త్ షో ని కూడా వదిలేస్తున్నాడు అని గతం లో వార్తలు వచ్చాయి, కానీ అందులో నిజం లేదు అని , ప్రాణం పొయ్యేవారుకూ నేను జబర్దస్త్ లో నటిస్తూనే ఉంటాను అని ఇటీవల ప్రసారం అయినా జబర్దస్త్ ఎపిసోడ్ లో కూడా సుధీర్ కన్ఫర్మ్ చెయ్యడం తో ఆయన అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు, సుధీర్ చేతిలో ప్రస్తుతం హీరో గా కాలింగ్ సహస్త్ర మరియు గాలోడు అనే రెండు సినిమాలు ఉన్నాయి, వీటితో పాటుగా ఆయన ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిట్లో కమెడియన్ గా నటిస్తున్నాడు, ఇటీవలే ఆయన అక్కినేని అఖిల్ హీరో గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో కమెడియన్ గా నటించాడు, ఈ సినిమాలో ఆయన పాత్రని థియేటర్స్ లో ఆడియన్స్ ఒక్క రేంజ్ లో ఎంజాయ్ చేసారు , దీనితో తర్వాత ఆయన కమెడియన్ గా డజనుకు పైగా సినిమాలకు సంతకం చేసాడు, వర్క్ లోడ్ ని తట్టుకోలేకనే ఆయన ఢీ షో కి గుడ్బై చెప్పాడు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్, మళ్ళీ ఆయన ఎదో ఒక్క రోజు ఢీ షో ప్రత్యక్షం అవుతాడు ఏమో అని అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రమేష్ బాబు గారి భార్య బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వుద్ది

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు సోదరుడు నటుడు మరియు నిర్మాత అయినా రమేష్ బాబు అ…