Home Entertainment అభిమానులకు సంచలన ప్రకటన చేసిన హీరో రానా..షాక్ లో టాలీవుడ్

అభిమానులకు సంచలన ప్రకటన చేసిన హీరో రానా..షాక్ లో టాలీవుడ్

0 second read
0
0
2,446

నేటి తరం యువ హీరోలలో విబిబిన్నమైన పాత్రలు చేస్తూ జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఒక్కడు రానా దగ్గుపాటి..గొప్ప ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ కి వచ్చినా కూడా కేవలం హీరో రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వలేదు రానా..కెరీర్ లో అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కున్తున్న సమయం లో బాహుబలి సిరీస్ లో విలన్ గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రానా..ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..ఇక ఆ తర్వాత రానా తనకి ఉన్న ఆరోగ్య సమస్యల వల్ల ఎక్కువ సినిమాలు చెయ్యలేకపోయాడు..మధ్యలో హిందీ, తమిళం మరియు తెలుగు లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ కూడా అది ఆయన కటౌట్ కి తగ్గ సినిమాలు కావు అనే చెప్పాలి..ఈ ఏడాది ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో పవర్ స్టార్ తో తలపడే సరిసమానమైన పాత్రని పోషించి మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు..ఈ సినిమా తర్వాత ఆయన చేసిన విరాట పర్వం చిత్రం ఇటీవలే విడుదల అయిన సంగతి మన అందరికి తెలిసిందే.

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది..కానీ ఈ సినిమాలో నటించిన రానా కంటే సాయి పల్లవి కి నటన పరంగా ఎక్కువ మార్కులు పడ్డాయి..దీనితో ఇలాంటి సినిమాలు చేస్తున్నందుకు రానా పై దగ్గుపాటి అభిమానులు తీవ్రమైన అసహనం ని వ్యక్తం చేస్తున్నారు..లీడర్ వంటి గొప్ప సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన రానా ని దగ్గుపాటి అభిమానులు తమ కుటుంబం నుండి మరో విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరో వచ్చాడని మురిసిపోయారు..కానీ ఆ తర్వాత సినిమా నుండి రానా తన ఇమేజ్ తగ్గ సినిమాలు కాకుండా ఆఫ్ బీట్ సినిమాలే చేస్తూ అభిమానులకు చిరాకు రప్పించాడు..ఇక బాహుబలి సినిమాలో విలన్ గా చేస్తున్నాడని తొలుత కాస్త నిరాశ చెందినప్పటికీ కూడా జాతీయ స్థాయి సినిమాలో నటిస్తున్నాడు కదా పర్లేదులే అని అనుకున్నారు..ఈ సినిమా సెన్సషనల్ హిట్ అయ్యి రానా కి మంచి పేరు తెచ్చిపెట్టింది..ఇక ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని దక్కించుకుంది..అదే దారిలో వరుసగా మాస్ మసాలా సినిమాలు చేసుంటే రానా ఈరోజు అగ్ర హీరోలలో ఒకడిగా కొనసాగేవాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కానీ రానా అంత పెద్ద హిట్ తగిలిన తర్వాత కూడా పూర్తి స్థాయి హీరో గా నటించలేదు..అలా రానా తన కెరీర్ ని మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాడని అభిమానులు ఆందోళన వ్యక్తపరిచారు..ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా ద్వారా రానా కి మంచి క్రేజ్ వచ్చింది..ఇప్పటి నుండి అయిన కెరీర్ గాడిలో పడుతుందని ఆశిస్తే విరాట పర్వం లాంటి ఆఫ్ బీట్ సినిమాని విడుదల చేసాడు..అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా మాట్లాడుతూ ‘నాకు ఇంత మంది ఫాన్స్ ఉన్నారని తెలియదు..సోషల్ మీడియా లో మొన్న అభిమానులు నాకు సలహాలు ఇస్తుంటే చూస్తూ ఉన్నాను..ఇక నుండి నేను ప్రయోగాత్మక సినిమాలు చెయ్యను..వాటికి శాశ్వతంగా సెలవు ప్రకటిస్తున్నాను..ఇక నుండి మీరు నన్ను ఎలా అయితే మాస్ గా చూడాలనుకున్నారో..అలాంటి సినిమాలే చేస్తాను..కుమ్మేద్దాం ఇక నుండి’ అంటూ చెప్పడం తో దగ్గుపాటి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..మరి ఇక నుండి రానా తన కెరీర్ ని ఎలా మలుచుకుంటాడో చూడాలి.

ఇక విరాట పర్వం సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే తెలంగాణ లోని వరంగల్ అడవుల్లో చోటు చేసుకున్న నక్సలైట్ ఎన్కౌంటర్ ని ఆధారంగా తీసుకొని డైరెక్టర్ వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు..హీరో హీరోయిన్లుగా రానా మరియు సాయి పల్లవి ఎంతో అద్భుతంగా నటించారు..కానీ మొదటి నుండి ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకపోవడం తో ఓపెనింగ్స్ అసలు రాలేదు అనే చెప్పాలి..ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి 10 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం..మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 8 కోట్ల రూపాయిలు వసూలు చెయ్యాల్సిన అవసరం ఉంది..మరి అంత మొత్తం లో ఈ సినిమా కలెక్షన్స్ ని రాబట్టి సూపర్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…