
బుల్లితెర పై తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బుల్లితెర యాంకర్స్ లో ఒక్కరు ప్రదీప్,ఈయన ఎక్కడ ఉంటె అక్కడ నవ్వులే నవ్వులు, ముఖ్యంగా ప్రదీప్ మరియు సుడిగాలి సుధీర్ కాంబినేషన్ కి ప్రేక్షకుల్లో అద్భుతమైన క్రేజ్ ఉంది, ఈటీవీ లో ప్రసారం అయ్యే ఢీ షో అంతటి ఘానా విజయం సాధించింది అంటే దానికి ముఖ్య కారణం వీళ్లిద్దరి పండించే హాస్యమే అని చెప్పొచ్చు, అయితే టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కోసం అయితే ఎంత ఏమండీ ఆతృతగా ఎదురు చూస్తున్నారో, బుల్లితెర పై స్టార్ గా ఒక్క వెలుగు వెలుగుతున్న ప్రదీప్ పెళ్లి కోసం కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు,ఈయన పెళ్లి టాపిక్ ఎంతటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటే, ప్రత్యేకంగా ఈయనకి పెళ్లి చెయ్యడం కోసం స్టార్ మా ఛానల్ లో ఒక్క రియాలిటీ షో నిర్వహించేంత,అయితే ఇటీవల తన పెళ్లి గురించి ప్రదీప్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.
ఇక అసలు విషయానికి వస్తే ప్రదీప్ హీరో గా పరిచయం అవుతూ తెరకెక్కిన చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ప్రదీప్ అనేక ఇంటర్వూస్ ఇచ్చాడు, ఈ సంబందర్భంగా ఆయన ఫేస్ బుక్ లో ఇటీవలే ఒక్క లైవ్ చాట్ సెషన్ కూడా నిర్వహించాడు, ఈ చాట్ లో ఒక్క అభిమాని పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రదీప్ ని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ‘ ఎక్కడికి వెళ్లిన ఈ ప్రశ్న కామన్ అయిపోతుంది(నవ్వూతూ), అప్పుడే పెళ్లి చేసుకొని ఏమి చెయ్యాలి భయ్యా,ఇంకా జీవితంలో సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయి, అవి సాధించాకే పెళ్లి చేసుకుంటాను,మనసుకి నచ్చిన అమ్మాయి కూడా దొరకాలి, కచ్చితంగా ఇంట్లో చూపించిన సంబంధం నే నేను చేసుకుంటాను, ప్రస్తుతానికి ఈ బ్యాచిలర్ లైఫ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాను, అలా కానివ్వండి నన్ను’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్.
ఇది ఇలా ఉండగా ఆయన హీరోగా నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా నిన్న ఘనంగా విడుదల అయినా సంగతి మన అందరికి తెలిసిందే, అసలు అంచనాలే లేని ఈ సినిమాని నీలి నీలి ఆకాశం అనే పాట సెన్సషనల్ హిట్ అయ్యి ప్రేక్షకుల్లో ఎలాంటి ఆసక్తి ని రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు,యూటుబ్ లో ఈ పాటకి 100 మిలియన్ కి పైగా హిట్స్ వచ్చాయి అంటే ఈ పాట ఏ స్థాయిలో ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఎక్కడ చూసిన ఈ పాటనే వినిపిస్తూ ఉండేది , ఒక్క పాట తో ఆ రేంజ్ అంచనాలను పెంచిన ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చింది,విడుదల అయిన తొలి ఆట నుండే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం లో సఫలీకృతం అయ్యింది అనే చెప్పాలి, ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ బోర్డ్స్ తో ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్స్ ని ఇచ్చారు మన ఆడియన్స్, ఇక ఈ సినిమా టాక్ విషయానికి వస్తే,స్టోరీ మామూలుది అయిన డైరెక్టర్ టేకింగ్ పరంగా అద్భుతంగా డీల్ చేసాడు అని , ముఖ్యంగా సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయ్యింది అని చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు, దీనితో ప్రదీప్ తొలి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కూతేసాడు అనే చెప్పొచ్చు, మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.