Home Entertainment అభిమానులకు రాజమౌళి దిమ్మ తిరిగే షాక్..ఇలా చేస్తే కష్టమంటున్న ట్రేడ్ పండితులు

అభిమానులకు రాజమౌళి దిమ్మ తిరిగే షాక్..ఇలా చేస్తే కష్టమంటున్న ట్రేడ్ పండితులు

1 second read
0
0
651

దర్శక ధీరుడు రాజమౌళి #RRR సినిమా తో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి ఊర మాస హీరోలతో మల్టీస్టార్ర్ర్ చెయ్యాలనే ఆలోచన ఏ దర్శకుడికి రాదు..ఎందుకంటే అది కత్తి మీద సాము లాంటిది..దశాబ్దాల నుండి ఈ రెండు కుటుంబాల మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద భీకరమైన పోరు నడిచింది..ఇప్పటికి నడుస్తూనే ఉంది..కానీ ఈ ఇద్దరి కుటుంబాలలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ మొదటి నుండి ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు..వారి స్నేహం మధ్య ఉన్న కెమిస్ట్రీ వల్లే ఈరోజు #RRR ఇంత పెద్ద సంచలన విజయం సాధించి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది..అంతటి భారీ విజయం సాధించిన సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ కాంబినేషన్ కోసం కేవలం అభిమానులు మరియు ప్రేక్షకులు మాత్రమే కాదు..మహేష్ బాబు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు..ఆయన ఎదురు చూపులకి మొత్తానికి తెరపడి ఈ సినిమా కి సంబంధించిన వర్క్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది..ఈ ఏడాది లోపు స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి..వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా గురించి సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అభిమానుల్లో కాస్త కలవరం ని రేపుతోంది..అదేమిటి అంటే రాజమౌళి ఈ సినిమా ని ఆఫ్రికా అడవుల్లో జరిగే యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో తియ్యబోతున్నాడు అట..ఇది వరుకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో ఒక్క సినిమా కూడా రాలేదు..రాజమౌళి తొలిసారిగా ఆ ప్రయోగం మహేష్ మూవీ ద్వారా చెయ్యబోతున్నాడు..దీనికే అభిమానులు కాస్త భయపడుతున్నారు..జనాలకు అలవాటు లేని యాక్షన్ అడ్వెంచర్ జానర్ లో సినిమా తీస్తే మొదటికే మోసం వస్తుందేమో అని వాళ్ళ భయం..అంతే కాకుండా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధ కపూర్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.శ్రద్దా కపూర్ ప్రస్తుతం వరుస ఫ్లాప్స్ లో ఉన్నది..మూడేళ్ళ క్రితం ఆమె ప్రభాస్ తో కలిసి నటించిన సాహూ సినిమా ఫలితం ఏంటో మన అందరికి తెలిసిందే..ఆమె బదులు జాన్వీ కపూర్..లేదా అలియా భట్ వంటి వారిని తీసుకునేట్ బాగుండును కదా..ఫ్లాప్స్ లో ఉన్న హీరోయిన్ ఎందుకు అని ట్విట్టర్ లో రాజమౌళి ని టాగ్ చేసి అడుగుతున్నారు అభిమానులు.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబం తో కలిసి జర్మనీ లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..సర్కారు వారి పాట సినిమాతో మంచి హిట్ ని అందుకున్న మహేష్ బాబు జర్మనీ టూర్ నుండి తిరిగి రాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకోబోతుంది..పూజ హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు..అతడు మరియు ఖలేజా వంటి క్లాసిక్ సినిమాల తర్వాత వస్తున్నా మూవీ కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి..ట్రేడ్ లో కూడా షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ సినిమా కి క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి..డీజే తిళ్ళు మరియు భీమ్లా నాయక్ వంటి సెన్సషనల్ హిట్ సినిమాలు తీసి మంచి ఊపు మీద ఉన్న సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…