Home Entertainment అభిమానులకు కోలుకోలేని షాక్ ని ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

అభిమానులకు కోలుకోలేని షాక్ ని ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

0 second read
0
1
24,580

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరో అంటే మన బుర్రలోకి వెంటనే స్ట్రైక్ అయ్యే పేరు నందమూరి బాలకృష్ణ, స్వర్గీయ నందమూరి తారక రామ రావు గారి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ఒక్క ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి సృష్టించుకొని మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి నిర్వచనం లా మారాడు, కెరీర్ లో ఎన్ని హిట్లు వచ్చిన , ఫ్లాపులు వచ్చిన మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆయన ఇమేజి ఇప్పటికి చెక్కు చెదరలేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, నటన లో కానీ , డైలాగ్ డెలివరీ లో కానీ, డాన్స్ లో కానీ నేటి తరం యువ హీరోలకు ఏ మాత్రం తానూ తక్కువ కాదు అని ఎన్నో సార్లు నిరూపించాడు, 1974 వ సంవత్సరం తాతమ్మ కల అనే సినిమా తో ప్రారంభం అయినా ఈ నందమూరి నట సింహం సినీ ప్రస్థానం 100 సినిమాలకు పైగా కొనసాగి ఇప్పటికి క్రేజీ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూనే ఉన్నాడు, ప్రస్తుతం ఆయన ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే.

గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ మరియు లెజెండ్ వంటి సినిమాలు ఎంతతి సంచలన విజయాలు సాధించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, బాలకృష్ణ ని బోయపాటి శ్రీను అంత అద్భుతంగా టాలీవుడ్ లో మరో డైరెక్టర్ చూపించలేడు అనడం లో ఎలాంటి సందేహం లేదు, అలాంటి కాంబినేషన్ కాబట్టే, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సెట్స్ పైకి వచ్చిన ఈ కాంబినేషన్ పై షూటింగ్ ప్రారంభ దశ నుండే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి,ఆ అంచనాలకు మించి ఉండేలా బోయపాటి శ్రీను ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అని విశ్వసనీయ వర్గాల సమాచారం, ఇది ఇలా ఉండగా ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గురించి సోషల్ మీడియా లో గత రెండు రోజుల నుండి వినిపిస్తున్న వార్త అభిమానులకు నిరాశ కలిగేలా చేస్తోంది, అదేమిటి అంటే ఈ సినిమానే బాలకృష్ణ చివరి సినిమా అని, దీని తర్వాత ఆయన మిగిలిన జీవితం పూర్తిగా రాజకీయాలకే సమర్పించాలనే ఆలోచనలో నందమూరి బాలకృష్ణ ఉన్నట్లు సమాచారం, ఆయన హిందూపూర్ ప్రాంతం నుండి 2014 మరియు 2019 సంవత్సరాలలో శాసనసభ్యుడిగా రెండు సార్లు గెలిచినా సంగతి మన అందరికి తెలిసిందే, 2019 వ సంవత్సరం లో టీడీపీ పార్టీ కి ఘోరమైన ఫలితాలు వచ్చినా కూడా బాలకృష్ణ మాత్రం అవలీలగా గెలుపొంది తెలుగు దేశం పార్టీ పరువుని నిలబెట్టాడు.

ఎమ్యెల్యే అయినా కూడా బాలకృష్ణ ఎక్కువగా సినిమాల పైనే ప్రాధాన్యత చూపదు,అడపాదడపా హిందూపూర్ నియోజక వర్గం లో పర్యటించి అక్కడి సమస్యలను పరిష్కరించిన కూడా ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలు మాత్రం చెయ్యలేదు, కానీ ఇప్పుడు టీడీపీ పార్టీ పరిస్థితి మరీ ఘోరంగా మారిపోయింది, 2019 వ సంవత్సరం లో కేవలం ఒక్క సీట్ కి మాత్రమే పరిమితం అయినా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఇప్పుడు రోజు రోజుకి పుంజుకుంటూ ప్రధాన ప్రతిపక్ష బలం ని సంపాదించుకునేందుకు ముందుకి పోతుంది, పంచాయితీ ఎన్నికలలో కూడా జనసేన పార్టీ కి ఎవ్వరు ఊహించని స్థాయిలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి, ఇక నూతన నాయకత్వం రాకపోతే పార్టీ మనుగడ కష్టం అని గ్రహించిన చంద్ర బాబు నాయుడు, ఇక టీడీపీ పార్టీ పగ్గాలు అన్ని బాలకృష్ణ కి అప్పజెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది, బాలకృష్ణ కూడా ఇటీవల టీడీపీ ముఖ్య నాయకులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ సమావేశం లో కూడా బోయపాటి సినిమా తర్వాత ఇక రోడ్ల మీదకి వస్తా అంటూ స్వయంగా తెలిపిన సంగతి మన అందరికి తెలిసిందే, దీనితో బోయపాటి తో తీస్తున్న అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని మరియు అనిల్ రావిపూడి వంటి దర్శకులతో బాలకృష్ణ సినిమాలు తీస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే,ఈ సినిమాల తర్వాత బాలకృష్ణ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వస్తాడు అని నందమూరి వర్గాల్లో వినిపిస్తున్న వార్త, మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు వేచి చూడాల్సిందే.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ తో పెళ్ళికి ముందు ఉపాసన ఆ హీరోతో ఇంత ప్రేమాయణం నడిపిందా..? బయటపడ్డ షాకింగ్ నిజం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,ఉపాసన కామినేని 2012 వ సంవత్సరం లో వివాహం చేసుకున్నారు, వీర…