Home Movie News అభిజీత్ మరియు అఖిల్ బయటకి వచ్చాక ఏమి మాట్లాడారో చూడండి

అభిజీత్ మరియు అఖిల్ బయటకి వచ్చాక ఏమి మాట్లాడారో చూడండి

0 second read
0
0
2,958

2020 వ సంవత్సరం లో జనాలుకి బాగా ఎంటర్టైన్మెంట్ పంచిన షో ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాస్ రియాలిటీ షో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు, మూడు సీసన్స్ దిగ్విజయం పూర్తి చేసుకొని నాల్గవ సీజన్లో ఈ ఏడాది భారీ అంచనాల నడుమ ప్రారంభం అయ్యింది, ఈ సీజన్లో ప్రారంభం నుండే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ముందుకు దూసుకుపోతూ రికార్డు టీ ఆర్ పీ రేటింగ్స్ ని సంపాదించింది, ప్రముఖ బ్రాడ్ క్యాస్ట్ సంస్థ బార్క్ రేటింగ్స్ లో దేశవ్యాప్తంగా ఉన్న అని టీవీ చానెల్స్ లో స్టార్ మా ఛానల్ నెంబర్ 1 ఎంటర్టైన్మెంట్ ఛానల్ గా నిలిచింది అంటే బిగ్ బాస్ షో ప్రభంజనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు,గడిచిన మూడు సీసన్స్ తో పోలిస్తే ఈసారి పాల్గొన్న కంటెస్టెంట్స్ పెద్ద సెలబ్రిటీస్ కాకపోయినా ఈ షో వాళ్ళని తిరుగులేని సెలబ్రిటీస్ ని చేసింది అనే చెప్పాలి, సుమారు 15 వారల పాటు కొనసాగిన ఈ బిగ్గెస్ట్ షో టైటిల్ విన్నర్ గా అభిజీత్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక ఈ షో లో రన్నర్ గా నిలిచినా అఖిల్ కూడా బిగ్ బాస్ షో ముందు ఆయన ఎవ్వరో ఎవ్వరికి తెలియకపోయిన బిగ్ బాస్ షో తర్వాత మంచి క్రేజ్ ని దక్కించుకున్నాడు, వాస్తవానికి ఈ సీజన్లో రన్నర్ గా సోహెల్ నిలవాల్సింది , కానీ టాప్ 3 కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ ఇచ్చిన 25 లక్షల రూపాయిల ప్రైజ్ మనీ ని స్వీకరించి ఆట నుండి తప్పుకోవడం తో అఖిల్ రన్నర్ గా నిలిచాడు, ఈ సీజన్లో మొదటి నుండి అఖిల్ మరియు సోహెల్ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే, షెల్ అఖిల్ కోసం తన గ్రాండ్ ఫినాలే టికెట్ కూడా త్యాగం చెయ్యడం మనం చూసాము, బిగ్ బాస్ ప్రైజ్ మనీ కూడా ఎవరు గెలిస్తే వాళ్ళు ఇద్దరు సరిసమానంగా పంచుకుందాం అనే ధీమా లో ఉన్నారు, కానీ అభిజీత్ కి బయట ఇంత క్రేజ్ ఉంది అనేది తెలీదు కదా పాపం, అభిజీత్ టైటిల్ గెలుచుకొని 50 లక్షల ప్రైజ్ మనీ కొట్టాడు, ఇక సోహెల్ తెలివిగా బిగ్ బాస్ ఇచ్చిన గొప్ప ఛాన్స్ ని తెలివిగా ఉపయోగించుకొని 25 లక్షల రూపాయిలు కొట్టాడు, పాపం అఖిల్ కి మాత్రం ఎలాంటి ప్రైజ్ మనీ దక్కకుండా రన్నర్ గా మిగిలాడు.

ఇక అఖిల్ మరియు అభిజీత్ హౌస్ లో ఉన్నంత కాలం గొడవలు పడుతూ వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే , కానీ చివరి వారం వచ్చేసరికి ఇద్దరు స్నేహితులుగా మారారు, అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరు వేరు వేరుగా ఇచ్చిన ఇంటర్వ్యూలు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది, ముందుగా అభిజీత్ మాట్లాడుతూ ‘ నాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన తెలుగు ప్రేక్షకులకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను,అసలు నాకు ఇంత క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అని నేను కలలో కూడా ఊహించలేదు, 8 ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్న దక్కని ప్రతిఫలం నాకు ఈ బిగ్ బాస్ ద్వారా దక్కేలా చేసినందుకు మా టీవీ కి మరియు అక్కినేని నాగార్జున గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు అభిజీత్.

ఇక రన్నర్ గా మిగిలిన అఖిల్ మాట్లాడుతూ ‘ఎక్కడో ఒక్క మూలాన ఉన్న నన్ను కోట్లాది మందికి ప్రజలకు పరిచయం అయ్యేలా చేసిన రియాలిటీ షో బిగ్ బాస్, నాకు ఓట్లు వేసి ఇంత దూరం తీసుకొచ్చిన ప్రేక్షకులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిచేసుకుంటున్నాను, టైటిల్ కొట్టాలి అనేది నా డ్రీం, టికెట్ తో గ్రాండ్ ఫినాలే లభించిన తర్వాత నాకు టాస్కులు రాకపోవడం , నేను రిలాక్స్ అవ్వడం వల్ల ఓట్లు తగ్గి ఉండొచ్చు, అందుకే నాకు టైటిల్ కొట్టేంత ఓట్లు రాలేదు అనే అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు అఖిల్, ఇది ఇలా ఉండగా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఫైనల్స్ లో అభిజీత్ కి కనివిని ఎరుగని స్థాయిలో 70 శాతం కి పైగా ఓట్లు నమోదు అయినట్టు తెలుస్తోంది, ఇది బిగ్ బాస్ చరిత్ర లో ఒక్క సంచలనం అని చెప్పొచ్చు, మిగిలిన ముప్పై శాతం హౌస్ మేట్స్ అందరికి కలిపి వచ్చినవి అని తేలింది, దీనిని బట్టి అభిజీత్ బిగ్ బాస్ షో ద్వారా ఏ రేంజ్ కి వెళ్ళాడో అర్థం చేసుకోవచ్చు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…