
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘ఆహా’లో స్ర్టీమ్ అవుతున్న ‘అన్ స్టాపబుల్ ఎన్బీకే’ సీజన్ 2 ఒక్కో సంచలనాన్ని నమోదు చేస్తుంది. సీజన్ ప్రారంభ ఎపీసోడ్ లో రాజకీయ నాయకులతో తర్వాత రాజకీయ నాయకులతో పాటు సినిమా తారలు, నిర్మాతలతో పాటు దర్శకుడు ఇప్పుడు రీసెంట్ గా హీరోలు ఇలా ఒక్కో వేరియంట్ తో ప్రతీ ఎపీసోడ్ ను అలరిస్తున్నారు బాలయ్య. ఆయన తాజా ఎపీసోడ్ డార్లింగ్ తో అంటూ కొంత కాలంగా వార్తలు వినిపించినా అవి నిజమే అంటూ రీసెంట్ గా ఆహా కూడా ప్రకటించింది. ప్రకటించడమే కాదు. ఏకంగా పిక్ లను కూడా షేర్ చేసింది. దీంతో డార్లింగ్ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
బాహుబలి ఎప్పుడెప్పుడు అన్ స్టాపబుల్ సెట్ కు వస్తాడంలూ గతంలో డార్లింగ్ ఫ్యాన్స్ ఆహాను ప్రశ్నించారట. దీంతో డార్లింగ్ తో ఓ ఎపీసోడ్ ప్లాన్ చేస్తే బాగుంటుందని నిర్వాహకులు కూడా అనుకున్నారట. కానీ వరుస షూట్లతో బిజీగా ఉన్న ప్రభాస్ వీలు కాలేదు కానీ నందమూరి బాలకృష్ణ పిలుపు మేరకు ఆయన రీసెంట్ గా ఓకే చెప్పారట. ఇంకేముంది అన్ స్టాపబుల్ సెట్ పైకి రానున్నారు ప్రభాస్. అయితే ప్రభాస్ తో ఆయన స్నేహితుడు మరో హీరో గోపీచంద్ కూడా రానున్నట్లు ఆహా పిక్ లను షేర్ చేసింది. దీంతో ఒక లెజెండ్ డార్లింగ్, గోపీచంద్ తో కలిసి సందడి చేయనున్నారు. ఈ ఎపీసోడ్ కు సంబంధించి చిత్రీకరణ కూడా పూర్తయిందట. మంగళవారం (డిసెంబర్ 13)న ఓ ‘స్పెషల్ వీడియో గ్లింప్స్’ను కూడా రిలీజ్ చేయనున్నట్లు ఆహా ప్రకటించింది.
ఈ ఎపీసోడ్ లో ప్రభాస్ మరో పని చేయబోతున్నారట. ఈ ఎపీసోడ్ లో బాలయ్య బాబు, గోపీచంద్ తో పాటు సెట్ నిర్వాహకులు, వచ్చిన ఆడియన్స్ కు కూడా కమ్మటి భోజనం పెట్టబోతున్నారట. మటన్ బిర్యాని కూడా ఇందులో ఉండబోతోందట. అందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదే నిజమైతే ప్రభాస్ ఎపీసోడ్ మరో వెరైటీగా ఉంటుందనడం ఖాయమనే చెప్పాలి.