
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్నటవంటి క్రేజ్ మరియు ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఆయనకీ ఉన్నంత ఫాలోయింగ్ టాలీవుడ్ లో ఏ హీరో కి కూడా లేదు..తెలుగు వాడు ఎక్కడున్నా అది పవర్ స్టార్ గడ్డ అని ట్రేడ్ వర్గాలు సైతం చెప్పేమాట అది..సెలెబ్రిటీలు సైతం ఆయనని ఎంతో ఆరాధిస్తారు..తన తోటి స్టార్ హీరోలు కూడా పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పిన సందర్భాలు గతం లో మనం ఎన్నో చూసాము..పవన్ కళ్యాణ్ ని అభిమానులతో పాటుగా సెలెబ్రిటీలు కూడా అంతలా ఇష్టపడడానికి ప్రధాన కారణం అతని మంచి తనం మరియు సింప్లిసిటీ..అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి ఆయన..తన సినిమాలకు కూడా ఆయన ఎప్పుడూ పబ్లిసిటీ చేసుకోవడం గతం లో మనం ఎప్పుడూ కూడా చూడలేదు..కేవలం అతని పేరు మీదనే బిజినెస్ మొత్తం జరిగిపోతూ ఉండేది..ఇంటర్వూస్ కూడా ఆయన ఇవ్వడం చాలా అరుదు.
ఎప్పుడైనా నిర్మాతలు ప్రత్యేకంగా ఇంటర్వూస్ కోసం రిక్వెస్ట్ చేసుకుంటే మాట్లాడడమే కానీ..ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కి కూడా రావడానికి చాలా ఇబ్బంది పడే తత్త్వం ఆయనది..అలాంటి పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి ఒక టాక్ షో లో పాల్గొనబోతున్నాడు..అది కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 టాక్ షో..ఇటీవలే ఆహా మీడియా టీం కూడా పరోక్షంగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ హింట్ ఇచ్చేసింది..అతి త్వరలోనే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయనున్నారు..ఈనెల 27 వ తారీఖున ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ జరగబోతుంది..ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా పాల్గొనబోతున్నారు..పవన్ కళ్యాణ్ దగ్గర ఎన్నడూ చూడని ఫన్ ని ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నామా..బాలయ్య బాబు ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు..రాజకీయ నేపథ్యం ఉన్న వీళ్లిద్దరు చిట్ చాట్ చేస్తే రాజకీయాల్లో కూడా ప్రకంపనలు రేపడం ఖాయం అంటున్నారు అభిమానులు.
అయితే ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ కి సెలెబ్రిటీలు అంత ఓపిక చేసుకొని ఎలా వస్తారు..వాళ్లకి కచ్చితంగా డబ్బులు ఇస్తేనే వస్తారు వంటి వార్తలు ఈ షో ప్రారంభం అయ్యినప్పటి నుండి సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ వస్తుంది..ఇప్పుడు త్వరలో పవన్ కళ్యాణ్ తో తియ్యబోతున్న ఎపిసోడ్ కోసం కూడా కళ్యాణ్ కి భారీ రేంజ్ లో పారితోషికం ఇస్తున్నారని..ఇప్పటి వరుకు వచ్చిన గెస్ట్స్ అందరికంటే పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఇస్తున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి..అయితే ఈ ఎపిసోడ్ కి కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు..వచ్చిన ఒక్క గెస్ట్ కూడా డబ్బులు తీసుకోలేదు..కేవలం అల్లు అరవింద్ కి ఉన్న నెట్వర్క్ మరియు బాలయ్య బాబు మీద ఉన్న గౌరవం వల్లే అందరూ మనస్ఫూర్తిగా ఈ షో లో పాల్గొన్నారని ఆహా మీడియా క్లోజ్ సర్కిల్స్ చెప్తున్న మాట..ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 27 వ తారీఖున షూట్ చేసి సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది.