
ఆహా మీడియా లో ప్రసారం అవుతున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు..ఈ షో ద్వారా బాలయ్య బాబు కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు..బాలయ్య అంటే కోపిష్టి..ఫ్యాన్స్ ని కొడుతుంటాడు..బూతులు మాట్లాడుతాడు ఇలాంటి కోణాలే ఇన్ని రోజులు మనం చూసాం..కానీ బాలయ్య బాబు మనస్తత్వం చిన్న పిల్లాడి లాంటిదని..ఆయన మనసు ఎంతో స్వచ్ఛమైనదని..అందరితో ఎంతో స్నేహం గా ఉంటాడని ఈ షో ద్వారా నిరూపితం అయ్యింది..మొదటి సీజన్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో..రెండవ సీజన్ అంతకు మించి సూపర్ డూపర్ హిట్ అయ్యే దిశగా ముందుకు పోతుంది..నిన్న గాక మొన్న ప్రభాస్ ఎపిసోడ్ షూటింగ్ జరిపిన ఆహా మీడియా..ఇప్పుడు లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా తీసుకొచ్చింది..నేడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ని పూర్తి చేసారు..ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలే తిరుగుతూ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అని తెలుసుకున్న అభిమానులు తెల్లవారు జామున నుండే అన్నపూర్ణ స్టూడియోస్ కి వేలాది సంఖ్యలో చేరుకున్నారు..పవన్ కళ్యాణ్ అడుగుపెట్టగానే పవర్ స్టార్ జిందాబాద్ నినాదాలతో హోరెత్తించారు..ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ని స్వయంగా ఆయన కార్ వద్దకి వెళ్లి, కౌగలించుకొని లోపలకి తీసుకెళ్లడమే..బాలయ్య వంటి సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ తో ఇంత మర్యాదగా నడుచుకోవడం పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..లోపలకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఇచ్చినటువంటి గ్రాండ్ ఎంట్రీ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కి కూడా ఇవ్వలేదనే చెప్పాలి..బాలయ్య నోటి నుండి పవన్ కళ్యాణ్ కి పడిన ఆ ఎలివేషన్స్ చూసి అందరూ షాక్ కి గురైయ్యారు..ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది..త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది..ప్రోమో కూడా మరో రెండు మూడు రోజుల్లో విడుదల చెయ్యబోతున్నారు.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మిత్రుడు మరియు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా హాజరయ్యాడు..ఆయనతో పాటు హరి హర వీరమల్లు దర్శకుడు క్రిష్ మరియు సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నారు..మధ్యలో రామ్ చరణ్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ కూడా ఎపిసోడ్ కి హైలైట్ గా ఉండబోతుంది..పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో పాటుగా రాజకీయాలకు సంబంధించి కూడా ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగాడట బాలయ్య..ఆద్యంతం వినోదం తో పాటు కాస్త సీరియస్ ప్రశ్నలు కూడా అడిగాడట బాలయ్య..చూడాలి మరి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ మొట్టమొదటి టాక్ షో సోషల్ మీడియా లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో అనేది.