
కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ అతి త్వరలోనే ప్రసారం కాబోతుంది..ఈ ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని భావించారు..కానీ సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ మూవీ టీం తో చిట్ చాట్ ఎపిసోడ్ ని షూట్ చేసి ఇటీవలే విడుదల చేసారు..ఈ ఎపిసోడ్ మూవీ ప్రొమోషన్స్ కి బాగా కలిసొచ్చింది..ఇక అభిమానుల నుండి విపరీతమైన ఒత్తిడి రావడం తో ఈరోజు ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక చిన్న గ్లిమ్స్ వీడియో ని విడుదల చేసారు..ఈ వీడియో కి అభిమానుల నుండి అదిరిపొయ్యే రెస్పాన్స్ వచ్చింది..విడుదల చేసిన నిమిషాల వ్యవధి లోనే లక్షల కొద్దీ లైక్స్ మరియు రీట్వీట్స్ వచ్చాయి..ప్రభాస్ ఎపిసోడ్ గ్లిమ్స్ కి జీవిత కాలం మొత్తం 11 వేల రీట్వీట్స్ పడితే..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ గ్లిమ్స్ కి కేవలం మూడు గంటల్లోనే 11 వేల రీట్వీట్స్ వచ్చాయి..ఇది ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు.
ఎపిసోడ్ లో ఇంకా కొన్ని షాట్స్ పెట్టి ఉంటె రీచ్ ఇంకా వేరే లెవెల్ లో ఉండేదని అభిమానులు అనుకుంటున్నారు..ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం లో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి అడిగారు..ఈ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగత విమర్శలు చేసే అందరికీ చెప్పుతో కొట్టినట్టు చేసాడట బాలయ్య బాబు..రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ని ఎదురుకోలేక,ఆయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు కాబట్టి , వైసీపీ పార్టీకి విమర్శించడానికి ఏమి లేకపొయ్యేసరికి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల మీదనే కామెంట్స్ చేస్తూ వచ్చేవాళ్ళు..ఇక నుండి ఆ కామెంట్స్ కి కూడా ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టబోతుందని సమాచారం..ఇక ఈరోజు విడుదల చేసిన ప్రోమో లో పవన్ కళ్యాణ్ తో బాలయ్య బాబు మాట్లాడుతూ ‘నీ కొలతలు తీసుకోవాలి అయ్యా’ అంటాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ అందుకు పగలబడి నవ్వుతాడు..ఎపిసోడ్ మొత్తానికి అదే హైలైట్ అయ్యింది.
అంతే కాకుండా ఈ ఎపిసోడ్ కి పవన్ కళ్యాణ్ తో పాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొంటాడు..షో మధ్యలో బాలయ్య బాబు రామ్ చరణ్ మరియు త్రివిక్రమ్ కి కాల్ చేస్తాడు..ప్రభాస్ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ ఫోన్ కాల్ హైలైట్ అయ్యింది..ఈ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ ఫోన్ కాల్ హైలైట్ అయ్యినట్టు సమాచారం..అంతే కాకుండా షో చివర్లో బాలయ్య బాబు కుమారుడు ‘మోక్షజ్ఞ’ తేజ వస్తాడు..పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగి వెళ్తాడు..ఇది మరో హైలైట్ గా ఈ ఎపిసోడ్ కి నిల్చింది..అలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ ఎపిసోడ్ ని చూడాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే.