
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారిగా ఒక టాక్ షో లో పాల్గొన్నాడు..ఆ టాక్ షో పేరే ‘అన్ స్టాపబుల్ విత్ NBK’..నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో..సీజన్ 2 అంతకు మించి సూపర్ హిట్ అయ్యే దిశగా అడుగులు తీస్తుంది..సీజన్ 1 లో నేటి తరం స్టార్ హీరోల నుండి ముఖ్య అతిథిగా హాజరైంది కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రమే..కానీ సీజన్ 2 లో కొద్దీ రోజుల క్రితమే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు..ఈ ఎపిసోడ్ 30 వ తారీఖున టెలికాస్ట్ కానుంది..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని విశేషాలు ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము..ఆ విశేషాలు చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు.
ముందుగా ఈ షో లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించడానికి బాలయ్య బాబు నేరుగా పవన్ కార్ దగ్గరకి వచ్చి రిసీవ్ చేసుకోవడం అందరి మనసుల్ని కదిలించింది..ఇక ఆ తర్వాత బాలయ్య బాబు పవన్ కళ్యాణ్ తో ముచ్చటించిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..మరో విశేషం ఏమిటంటే బాలయ్య బాబు తనయుడు ‘మోక్షజ్ఞ తేజ’ ని ఎపిసోడ్ చివర్లో బాలయ్య బాబు ప్రత్యేకంగా ఆహ్వానించి పవన్ కళ్యాణ్ తో ఫోటో తీయించి పంపించడం కొసమెరుపు లాంటిది..మోక్షజ్ఞ తేజ పవన్ కళ్యాణ్ కి మొదటి నుండి పెద్ద ఫ్యాన్ అట..ఈ విషయం బాలయ్య బాబు ఈ ఎపిసోడ్ ద్వారా చెప్తే కానీ ఎవరికీ తెలియదు.
పవన్ కళ్యాణ్ సినిమాలు ఏది కూడా మిస్ అవ్వకుండా మోక్షజ్ఞ బాగా చూస్తాడట..అందుకే కొడుకుని ప్రత్యేకంగా పిలిపించి చివర్లో ఫోటో తీయించాడు బాలయ్య..ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో అతి తర్వరలోనే విడుదల కానుంది..ఫుల్ ఎపిసోడ్ వచ్చే సంక్రాంతి నుండి ఆహా లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం..ఇది ఇలా ఉండగా త్వరలో జరగబొయ్యే బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడట..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే తెలియనుంది.