Home Entertainment అన్నయ్య ని నమ్మి 100 కోట్ల రూపాయిలు నష్టపోయిన విక్టరీ వెంకటేష్

అన్నయ్య ని నమ్మి 100 కోట్ల రూపాయిలు నష్టపోయిన విక్టరీ వెంకటేష్

3 second read
0
0
2,325

టాలీవుడ్ లో ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అని అడిగితె మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేరు విక్టరీ వెంకటేష్..ఏ హీరోకైనా ఫామిలీ ఆడియన్స్ లో కాస్త క్రేజ్ వస్తే చాలు వెంకటేష్ తో పోల్చేసుకుంటారు..అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న వెంకటేష్ కి ఎన్ని హిట్స్ అయితే ఉన్నాయో ఫ్లాప్స్ కూడా అన్నే ఉన్నాయి..అయితే లాక్ డౌన్ సమయం లో వెంకటేష్ తన అభిమానులను బాగా నిరాశ పరిచాడు..చాలా కాలం తర్వాత ఆయన సోలో హీరో గా చేసిన ఒక మంచి చిత్రం ‘నారప్ప’ ని OTT లో విడుదల చేసాడు..ఈ సినిమా థియేటర్ లో విడుదల అయ్యి ఉంటె బాక్స్ ఆఫీస్ పరంగా వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని ట్రేడ్ పండితుల అభిప్రాయం..పోనీ వెంకటేష్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచినా దృశ్యం సినిమా సీక్వెల్ ని అయినా థియేటర్స్ లో విడుదల చేస్తాడు అనుకుంటే ఆ చిత్రాన్ని కూడా OTT లో వదిలి నిరాశ పరిచాడు.

అయినా పాపం వెంకటేష్ మాత్రం ఏమి చేస్తాడులే..నిర్మాత ఆయన కాదుగా..ఆ రెండు సినిమాలకు సురేష్ బాబునే నిర్మాత..వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమాలను నేరుగా OTT లో విడుదల చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చిందో అతనికి అని అప్పట్లో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసాయి..కొంతమంది వెంకటేష్ ఫాన్స్ అయితే ఆన్లైన్ లో ఆత్మహత్య చేసుకుంటాము అని బెదిరించారు కూడా..అయినా కూడా లెక్క చెయ్యకుండా సురేష్ ఆ రెండు సినిమాలను OTT లో నేరుగా వదిలేసాడు..అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరో గా నటించిన దృశ్యం – 2 కి వస్తున్నా వసూళ్లను చూసి వెంకటేష్ ఫాన్స్ బోరుమని విలపిస్తున్నారు..కేవలం నాలుగు రోజుల్లోనే ఈ సినిమా 76 కోట్ల రూపాయిలను వసూలు చేసి సెన్సేషన్ సృష్టించింది..వీక్ డేస్ లో కూడా ఈ చిత్రానికి స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తున్నాయి..అలాంటి పవర్ ఫుల్ కంటెంట్ ఉన్న సినిమాని OTT లో విడుదల చేసి భారీ బాక్స్ ఆఫీస్ ని మిస్ చేసావంటూ వెంకటేష్ ఫాన్స్ సురేష్ బాబు ని టాగ్ చేసి సోషల్ మీడియా లో తిడుతున్నారు.

ఇంకోసారి మీ అన్నయ్య నిర్మాణ సంస్థలో నటించకు అంటూ వెంకటేష్ ఫాన్స్ వెంకటేష్ ని కూడా ట్విట్టర్ లో ట్యాగ్ చేసి బ్రతిమిలాడుతున్నాడు..దృశ్యం సినిమా భారీ హిట్ అయ్యింది కాబట్టి..దానికి సీక్వెల్ అంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి క్రేజ్ ఉంటుంది..ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరుకు కలెక్షన్స్ దుమ్ము లేపేసేవి..అలాంటి ఛాన్స్ ని మిస్ చేసుకున్నందుకు వెంకటేష్ ఫాన్స్ బాధ వర్ణనాతీతం..ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ హవా గట్టిగ నడుస్తుంది..ఇలాంటి సమయం లో దృశ్యం – 2 ని ఇప్పటికైనా భారీ పబ్లిసిటీ చేసి విడుదల చేస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేచిపోతుందని..తాము ఎంతగానో ఇష్టపడిన ఈ రెండు సినిమాలను వెండితెర మీద చూసే అదృష్టం కలిగించమంటూ సురేష్ బాబు ని ఫాన్స్ బ్రతిమిలాడుతున్నారు..మరి ఆయన కరుణించి ఆ చిత్రాన్ని విడుదల చేస్తాడో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…