Home Movie News అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కి ఊహించని షాక్ ఇచ్చిన అభిజీత్ ఫాన్స్

అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జున కి ఊహించని షాక్ ఇచ్చిన అభిజీత్ ఫాన్స్

0 second read
0
1
5,332

సౌత్ ఇండియన్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ అలాంటిది ఇలాంటిది కాదు, వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈ షో చూడడం ఒక్క అలవాటు గా మారిపోయింది, ఒక్క ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశం లోను ఈ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది, మన తెలుగు లో కూడా ఈ షో అదే స్థాయిలో జనాల్లోకి వెళ్ళిపోయింది, ఇప్పటికే మన తెలుగులో మూడు సీసన్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ప్రస్తుతం నాల్గవ సీసన్ కూడా ముగింపు దశకి చేరుకుంది, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ బిగ్ బాస్ 4 సీసన్ కి ఉండు మూడు సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ కి విపరీతమైన టీ ఆర్ పీ రేటింగ్స్ రావడం విశేషం, ముఖ్యం గా ఈ సీసన్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎవరికీ వారు అద్భుతమైన ఆతని ఆడి తమకంటూ ఒక్క ప్రేక్షకుల్లో ఒక్క ప్రతిరేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు, వారిలో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది అభిజీత్ గురించి.

శేఖర్ కముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయినా అభిజీత్ ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు, ఇక ప్రముఖ యాంకర్ వర్షిణి తో కలిసి ఆయన చేసిన పెళ్లి గోల అనే వెబ్ సిరీస్ భారీ హిట్ అవ్వడం తో అభిజీత్ కెరీర్ కి మళ్ళీ మంచి ఊపు దక్కినట్టు అయ్యింది, ఇక ఆ పెళ్లి గోల వెబ్ సిరీస్ తర్వాత ఆయన బిగ్ బాస్ సీసన్ 4 లో ఒక్క కంటెస్టెంట్ గా మన అందరికి దర్శనం ఇచ్చాడు, బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టిన రోజు నుండే అందరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తూ వచ్చిన అభిజీత్ ఇప్పుడు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకునే రేస్ లో ముందు వరుసలో ఉన్నాడు, ఈ షో ద్వారా ఆయన సంపాదించుకున్న క్రేజ్ మామూలుది కాదు, నాలుగు సినిమాల్లో హీరో గా నటించిన , ఒక్క విజయవంతమైన వెబ్ సిరీస్ లో నటించిన రాని గుర్తింపు మరియు పాపులారిటీ ని అభిజీత్ బిగ్ బాస్ షో ద్వారా సంపాదించాడు అని చెప్పడం ఎలాంటి సందేహం లేదు, మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే ఫిజికల్ టాస్కులలో కొద్దిగా వీక్ అయినా కూడా హౌస్ మేట్స్ తో ఆయన నడుచుకునే విధానం , పద్దతి మరియు ముక్కు సూటితనం వంటి లక్షణాలు ప్రేక్షకులకు ఆయనని దగ్గర అయ్యేలా చేసాయి.

ఇది ఇలా ఉండగా మొన్న జరిగిన ఎపిసోడ్ లో అభిజీత్ పై అక్కినేని నాగార్జున చాల తీవ్రంగా సీరియస్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే, జలజ దెయ్యం టాస్క్ లో అభిజీత్ పాల్గొనడానికి ఆసక్తి చూపకపోవడం తో నాగార్జున ఆయన పై తీవ్రమైన అసహనం వ్యక్తం చేసారు, ఒక్క కెప్టెన్ గా అభిజీత్ టాస్క్ చెయ్యకపోతే చేయించాల్సిన బాధ్యత కెప్టెన్ ది అని ఆ వారం హోసూరు కెప్టెన్ అయినా హారిక మీద కూడా నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు, అయితే అభిజీత్ పట్ల ఇలా ప్రవర్తించడం పై ఆయన అభిమానులు అక్కినేని నాగార్జున పై తీవ్రమైన కోపం లో ఉన్నారు, బిగ్ బాస్ షో జరుగుతన్న అన్నపూర్ణ స్టూడియోస్ కి అభిజీత్ ఫాన్స్ వందల సంఖ్యల్లో వచ్చి నినాదాలు చేసారు, హౌస్ అంత మంది అన్ని తప్పులు చేసిన ప్రశ్నించకుండా కేవలం అభిజీత్ ని టార్గెట్ చెయ్యడం ఎంత వరుకు కరెక్ట్ అని ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం ని వ్యక్తపరుస్తున్నారు, అటు సోషల్ మీడియా లో కూడా స్టాప్ టార్గెటింగ్ అభిజీత్ అని ఆయన అభిమానులు వేల సంఖ్యల్లో ట్వీట్స్ కూడా వేశారు, మరి దీనికి అక్కినేని నాగార్జున నుండి ఎలాంటి సమాధానం వస్తుందో వేచి చూడాలి.

 

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Movie News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…