Home Entertainment అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా జల్సా సినిమా ప్రపంచ రికార్డు

అత్యధిక టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాగా జల్సా సినిమా ప్రపంచ రికార్డు

0 second read
0
0
330

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ఒక్క మాట లో చెప్పలేము..ఎందుకంటే ఆయనకీ ఉన్నటువంటి క్రేజ్ టాలీవుడ్ లో ఏ హీరో కి కూడా లేదు అని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలిచింది ఇటీవల విడుదలైన జల్సా సినిమా రీ రిలీజ్..పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో ఘనంగా విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..700 కి పైగా షోస్ ని ప్రదర్శించగా దాదాపుగా మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది..ఇది కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు..ప్రపంచ రికార్డు గా చెప్పుకోవచ్చు..నెల రోజుల క్రితం మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షోస్ ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించిన సంగతి మన అందరికి తెలిసిందే..సుమారు 375 స్పెషల్ షోస్ ఈ సినిమాకి వెయ్యగా దాదాపుగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.

ఇదే నిన్న మొన్నటి వరుకు ఆల్ టైం రికార్డు గా ఉన్నింది..అయితే ఈ రికార్డు ని లేపడం ఎవరి తరం కాదని..మార్కెట్ లో పండుగాడికి ఉన్న క్రేజ్ ని ఎవ్వరు మ్యాచ్ చెయ్యలేరని..ఇది ఒక శాశ్వత రికార్డుగా మిగిలిపోతుందని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో గర్వంగా చెప్పుకునేవారు..కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ జల్సా అనే యావరేజి కంటెంట్ సినిమా తో పోకిరి రికార్డు ని చిత్తూ చిత్తూ చేస్తుందని బహుశా పవన్ కళ్యాణ్ ఫాన్స్ కూడా ఊహించి ఉండరు..అలాంటి అద్భుతమైన ఫీట్ ని సాధించారు పవర్ స్టార్ ఫాన్స్..కేవలం నైజాం ప్రాంతం నుండే జల్సా సినిమా స్పెషల్ షోస్ కి దాదాపుగా కోటి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది మాములు విషయం కాదు..అంతే కాదు అత్యధిక టికెట్స్ అమ్ముడుపోయిన ఏకైక స్పెషల్ షోస్ చిత్రం గా జల్సా సినిమా అరుదైన రికార్డుని నెలకొల్పింది..భవిష్యత్తులో కూడా ఈ సినిమా స్పెషల్ షోస్ రికార్డు ని బ్రేక్ చెయ్యడం చాలా కష్టమైన విషయం.

ఈ సినిమాకి కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్ లోనే 35 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు రాగా 13 వేల టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..ఇది ఒక ఆల్ టైం సెన్సషనల్ రికార్డు..పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలకు మొదటి రోజు కూడా ఈ రేంజ్ వసూళ్లు రావు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ఇక హైదరాబాద్ మొత్తం కలిసి ఈ సినిమాకి దాదాపుగా 50 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇక నైజం ప్రాంతం లో అయితే ఈ సినిమా కి ప్రతి చోట హౌస్ ఫుల్స్ పడ్డాయి..మొత్తం మీద నిజ్జమా ప్రాంతం కలిపి 60 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..ఇది ఒక ఆల్ టైం సెన్సషనల్ రికార్డుగా చెప్పొచ్చు..ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి దాదాపుగా లక్ష 30 వేల టికెట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది..ఇది కేవలం టాలీవుడ్ లో మాత్రమే రికార్డు కాదు..ప్రపంచ రికార్డు గా చెప్తున్నారు..మరి ఈ రికార్డు ని కొట్టే సత్తా ఏ హీరో కి ఉందొ చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ మూవీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం

మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై…