Home Entertainment అతని వల్లే ఢీ షో మానేసాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ప్రదీప్

అతని వల్లే ఢీ షో మానేసాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన యాంకర్ ప్రదీప్

7 second read
0
0
168

ఎంటర్టైన్మెంట్ షోస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచినా ఛానల్ ఈటీవీ ఛానల్..ఈ ఛానల్ లో ప్రసారం అయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ అన్ని కూడా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు..జబరదస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రారంభం అయినా ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ ట్రెండ్ ఇప్పటికి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది..అయితే ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారం అవుతున్న ఎంటర్టైన్మెంట్ షోస్ TRP రేటింగ్స్ అన్నీ కూడా దారుణంగా పడిపోయాయి..దానికి కారణం ఈ షోస్ కి ప్రారంభం నుండి వెనుముకలా ఉంటున్న కంటెస్టెంట్స్ మరియు జడ్జిలు ఒక్కొక్కరిగా షోస్ ని వదిలి వెళ్లిపోవడం వల్లే..అసలు ఇప్పుడు ఈటీవీ లో జబర్దస్త్ షో ని చూసేది కేవలం సుడిగాలి సుధీర్ మరియు హైపర్ ఆది స్కిట్స్ కోసమే..ఇప్పుడు వాళ్లిదరు షో ని వదిలి వెళ్లిపోవడం తో TRP రేటింగ్స్ అతి దారుణంగా పడిపోయాయి..ముందుగా ఈ షో కి ప్రారంభం నుండి జడ్జి గా వ్యవహరిస్తున్న నాగబాబు షో మానేసాడు..ఇక ఆ తర్వాత ఇటీవలే రోజా కూడా ఈ షో ని మానేయాల్సి వచ్చింది..కానీ ఎంటర్టైన్మెంట్ పరంగా సుధీర్ మరియు హైపర్ ఆది లు ఈ షో ని నిలబెట్టడం వల్ల TRP రేటింగ్స్ లో ఎలాంటి మార్పు రాలేదు..ఇప్పుడు వాళ్లిదరు షో మానేయడం తో 6 TRP రేటింగ్స్ ని సంపాదించుకునే జబర్దస్త్ షో కి ఇప్పుడు 2 TRP రేటింగ్స్ కి పడిపోయింది.

ఇక ఈటీవీ లో జబర్దస్త్ షో తర్వాత మంచి TRP రేటింగ్స్ ని సంపాదించుకునే మరో షో ఢీ..ఎన్నో ఏళ్ళ నుండి ఈ డాన్స్ ప్రోగ్రాం ETV లో నడుస్తూనే ఉంది..అయితే ఈ షో లో సుధీర్ – ప్రదీప్ – హైపర్ ఆది కలిసి పండించే హాస్యం అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి..వీళ్ళతో పాటుగా రష్మీ మరియు వర్షిణి వంటి వారు అద్భుతమైన హాస్యం పండించేవారు..వీళ్లంతా ఢీ షో మీద ఉన్నంతసేపు సందడి గానే ఉంటుంది..వీళ్ళతో పాటు జడ్జిగా వ్యవహరించే శేఖర్ మాస్టర్ వేసే పంచులు కూడా కడుపుబ్బా నవ్వించేవి..కానీ అప్పుడు ఉన్న టీం లో ప్రస్తుతం హైపర్ ఆది – ప్రదీప్ తప్ప అందరూ ఈ షో ని మానేశారు..దాంతో TRP రేటింగ్స్ అన్నీ ఒక్కసారిగా పడిపోయాయి..ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్న వార్త ఏమిటి అంటే అతి త్వరలోనే ఈ షో కి యాంకర్ ప్రదీప్ కూడా గుడ్బై చెప్పబోతున్నట్టు తెలుస్తుంది..ఇదే కనుక జరిగితే ఢీ షో TRP రేటింగ్స్ మరింత దారుణంగా పడిపొయ్యే అవకాశం ఉంది.

అసలు ప్రదీప్ ఈ షో ని మానేయడానికి కారణం ఆయన కోరినంత పారితోషికం మల్లె మాల ఎంటర్టైన్మెంట్స్ వారు ఇవ్వలేకనే అట..గతం లో అయితే అద్భుతమైన TRP రేటింగ్స్ వచ్చేవి కాబట్టి పారితోషికాలు కూడా బలంగానే ఇచ్చేవారు..కానీ ఇప్పుడు క్రమంగా TRP రేటింగ్స్ మొత్తం తగ్గిపోవడం తో ఆర్టిస్టులు మరియు యాంకర్లు అడిగేంత డబ్బులు ఇవ్వలేకపోతున్నారట..అందుకే సుధీర్ ,హైపర్ ఆది లు కూడా ఈటీవీ షోస్ అన్నిటిని వదిలి స్టార్ మా మరియు జీ తెలుగు చానెల్స్ లో ప్రసారం అయ్యే షోస్ కి వెళ్లిపోయారు..ఇప్పుడు యాంకర్ ప్రదీప్ కూడా అదే బాట లో నడవబోతున్నట్టు సమాచారం..ఒక్కో ఎపిసోడ్ కి 4 లక్షల రూపాయిలు పారితోషికం తీసుకునే ప్రదీప్ కి ఇతర చానెల్స్ నుండి ఒక్క ఎపిసోడ్ కి గాను 6 నుండి 7 లక్షల రూపాయిల పారితోషికం ని ఆఫర్ చేస్తున్నారట..అంతే కాకుండా సినిమాల్లో హీరో గా కూడా ఆయనకీ మంచి అవకాశాలే వస్తున్నాయి..కెరీర్ పీక్స్ కి వెళ్తున్న సమయం లో ఢీ షో ని మానేయడమే బెస్ట్ అనే నిర్ణయానికి ప్రదీప్ వచ్చినట్టు సమాచారం..మరి ప్రదీప్ ఢీ షో మానేస్తే ఆయన స్థానం లోకి ఎవరు వస్తారో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…