
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజ కొణిదెల గురించి తెలియని వారు ఉండరు. ఆమె సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియాతో ఎంతో మంది ఫాలోవర్లను కలిగి ఉంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులతో ఇంటరాక్ట్ అవుతుంటుంది. ఇటీవల ఆమె తన రెండో భర్త కళ్యాణ్‌దేవ్‌కు దూరంగా ఉంటోంది. వీళ్లిద్దరు విడిపోవడం గురించి అధికారికంగా సమాచారం లేకపోయినా విడాకులు తీసుకున్నట్లు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. తాజాగా శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 2023 ఏడాదిలో కొత్త వ్యక్తితో తనకు కొత్త ప్రయాణం మొదలైందని శ్రీజ వెల్లడించింది. కొత్త జీవితం ప్రారంభమైందని చెప్పడంతో శ్రీజ మూడో పెళ్లి చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని మెగా అభిమానులు చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుంచి ఉన్నంతమంది నటులు మరే ఫ్యామిలీ నుంచి కూడా లేరు. మెగా ఫ్యామిలీలో సుమారు 10 మంది వరకు నటిస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, నిహారిక కొణిదెల, కళ్యాణ్ దేవ్ వంటి నటులు ఉన్నారు. అయితే ఇటీవల కళ్యాణ్‌దేవ్‌ను మెగా ఫ్యామిలీ పట్టించుకోవడం లేదు. దీంతో అతడి సినిమాల ప్రమోషన్‌లకు మెగా ఇంటి సభ్యులు దూరంగా ఉంటున్నారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యామిలీని ఎంతగానో ఆదరించే అభిమానులు ఉన్నారు. అదే సమయంలో స్టార్ సెలబ్రిటీల ఫ్యామిలీ విషయాలు తెలుసుకునేందుకు అమితాసక్తి ప్రదర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే చిరంజీవి రెండో కూతురు శ్రీజ కొంతకాలంగా తరచూ లైమ్‌లైట్‌లో ఉంటోంది. ఆమె 19 ఏళ్ల వయసులోనే శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ పెద్దలను ఎదిరించి మరీ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
కానీ కొన్నాళ్లకే శ్రీజ, శిరీష్ భరద్వాజ్ విడిపోయారు. అప్పటికే వీళ్లకు ఓ కుమార్తె ఉంది. అయినా వీళ్లిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం 2016లో కళ్యాణ్‌దేవ్‌ను శ్రీజ పెళ్లి చేసుకుంది. వీళ్లకు కూడా ఓ కుమార్తె జన్మించింది. కొంతకాలంగా వీళ్లు కూడా దూరంగానే ఉంటున్నారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శ్రీజ న్యూఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. డియర్ 2022.. నా జీవితంలో కొత్త వ్యక్తిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నా గురించి బాగా తెలిసిన వ్యక్తి, నన్ను అమితంగా ప్రేమించే వ్యక్తి, కేరింగ్‌గా చూసుకుంటూ.. కష్ట, సుఖాల్లో తోడుండే వ్యక్తి, ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలిచే ఆ వ్యక్తి మరెవరో కాదు.. నేనే. ఈ ఏడాది నా గురించి నేను ఎక్కువగా తెలుసుకోవడం ఆనందంగా ఉంది. కొత్త ప్రయాణం మొదలైంది అంటూ శ్రీజ పోస్ట్ చేసింది. ఇంతకీ గత ఏడాది శ్రీజ కలుసుకున్న అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరా అంటూ మెగా అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఏదేమైనా శ్రీజ మూడో పెళ్లిపై కాలమే సమాధానం చెప్పాలి.