
కరోనా మహమ్మారి వ్రిజృంభణ వల్ల కుదేలు అయ్యిపోయిన మన తెలుగు సినీ పరిశ్రమకి ఇటీవల విడుదల అయినా పెద్ద సినిమాలు అన్ని ఊపిరి పోసి మళ్ళీ పూర్వ వైభవం ని తీసుకొచ్చాయి..అఖండ సినిమాతో ప్రారంభం అయినా మన తెలుగు సియోనిమా బాక్స్ ఆఫీస్ జైత్ర యాత్ర..ఆ తర్వాత పుష్ప సినిమా తో దేశం మొత్తం మన తెలుగు సినిమా గురించి మారుమోగిపోయ్యేలా చేసింది..ఇక తర్వాత విడుదల అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది..ఈ సినిమా తర్వాత వచ్చిన #RRR మరియు KGF చాప్టర్ 2 వంటి సినిమాలు కూడా సెన్సేషన్ సృష్టించిన మన అందరికి తెలిసిందే..డిస్ట్రిబ్యూటర్స్ మరియు బయ్యర్స్ చాలా కాలం తర్వాత చేతినిండా లాభాలతో మంచి జోష్ మీద ఉన్నారు..ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ మధ్య ప్రభాస్ రాధే శ్యామ్ మరియు మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలు మాత్రం చాలా తీవ్రమైన నిరాశకి గురి అయ్యేలా చేసాయి..బయ్యర్స్ కి ఈ రెండు సినిమాలు చాలా తీవ్రమైన నష్టాలనే కలిగించాయి..ప్రస్తుతం వాళ్ళందరి చూపు సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పైనే ఉన్నాయి..ఆచార్య మరియు రాధే శ్యామ్ సినిమాలు కలిగించిన నష్టాలు నుండి సర్కారు వారి పాట సినిమా ఆదుకుంటుంది అనే గట్టి నమ్మకం తో ఉన్నారు.
ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యిపోయాయి..అమెరికా , UK వంటి ప్రాంతాలలో కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది..అమెరికా లో ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లక్ష డాలర్లు దాటేసింది అని అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి..కరోనా తర్వాత విడుదల అయినా సినిమాలలో రాజమౌళి #RRR కాకుండా ఇప్పటికి టాప్ ప్రీమియర్స్ రికార్డ్స్ కొట్టి ఉన్న సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ చిత్రం..ఈ సినిమా ఇక్కడ దాదాపుగా కేవలం ప్రీమియర్స్ నుండి 9 లక్షల డాలర్లు వసూలు చేసింది..ఇప్పుడు ఈ రికార్డు ని మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కొడుతుందా లేదా అనేది చూడాలి..ప్రస్తుతం నడుస్తున్న అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమా కచ్చితంగా భీమ్లా నాయక్ రికార్డు ని బద్దలు కొడుతోంది అని మహేష్ బాబు అభిమానులు గట్టి నమ్మకం తో ఉన్నారు..కానీ సర్కారు వారి పాట సినిమాకి అమెరికా లో హాలీవుడ్ మూవీ డాక్టర్ స్ట్రేంజ్ చాలా గట్టి దెబ్బ కొట్టేలా కనిపిస్తుంది..రెండు సినిమాలు ఒక్కేరోజు విడుదల అవ్వబోతుండడం తో ఆ సినిమా ప్రభావము డాక్టర్ స్ట్రేంజ్ పై చాలా తీవ్రంగా పడుతుంది అని ట్రేడ్ వర్గాల అంచనా.
డాక్టర్ స్ట్రేంజ్ ప్రభంజనం ని దాటుకొని సర్కారు వారి పాట సినిమా భీమ్లా నాయక్ రికార్డు ని బద్దలు కొడితే మహేష్ బాబు ని మించిన స్టార్ మరొక్కరు లేరు అని అభిమానులు గర్వం గా చెప్పుకోవచ్చట..చూడాలి మరి ఈ సినిమా భీమ్లా నాయక్ రికార్డు ని బద్దలు కొడుతుందో లేదో..వచ్చే సోమవారం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోబోతున్న ఈ సినిమా , సెన్సార్ అయ్యిపోయిన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తి స్థాయిలో ప్రారంభం అవ్వబోతున్నాయి అని తెలుస్తుంది..ప్రస్తుతానికి #RRR సినిమా ఇండియా వైడ్ కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా 50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది..అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల నుండే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 20 క్తోల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది..సర్కారు వారి పాట సినిమాకి భీమ్లా నాయక్ కంటే అధికమైన టికెట్ రేట్స్ కచ్చితంగా ఉండడం వల్ల మొదటి రోజు భీమ్లా నాయక్ సినిమా రికార్డు ని కచ్చితంగా బద్దలు కొడుతోంది అని అభిమానులు భావిస్తున్నారు..చూడాలి మరి.