
టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న చిత్రం లైగర్..విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ తెరిచినా ప్రతి చోట హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోతున్నాయి..ఈ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చూస్తుంటే విజయ్ దేవరకొండ ఇక మీడియం రేంజ్ హీరో కాదు..పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు లాంటి స్టార్ హీరో అని అంటున్నారు ట్రేడ్ పండితులు..ముఖ్యంగా నైజం ప్రాంతం లో అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ భీమ్లా నాయక్ మరియు సర్కారు వారి పాట సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ని తలపిస్తున్నాయి..ఒక్కసారి బుక్ మై షో వెబ్ సైట్ ని తెరిచి చూస్తే ఈ విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతాది..విజయ్ దేవరకొండ కి ఈ స్థాయి లో క్రేజ్ వచ్చేస్తుంది అని బహుశా విజయ్ దేవరకొండ కూడా ఊహించి ఉండదు.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ కి రీచ్ అవ్వడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి..ముఖ్యంగా ఆయనకీ యూత్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు..ఉదాహరణకి నిజం ప్రాంతం లో లైగర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ని తీసుకుందాం..ఈ ట్రెండ్ ని పరిశీలిస్తే ఇక విజయ్ దేవరకొండ ఎవ్వరు కూడా స్టార్ హీరో కాదు అనకుండా ఉండలేరు..విడుదలకి రెండు రోజుల ముందే ఈ సినిమా హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా దాదాపుగా రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది..ఇది మాములు విషయం కాదు..పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరియు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా విడుదలకి రెండు రోజుల ముందు ఇదే ట్రెండ్ ని కొనసాగించింది..ఒక్క నైజం ప్రాంతం నుండే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది..ఇదే కనుక జరిగితే అరాచకం అనే అనాలి.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయాయి..కేవలం అమెరికా నుండే ఈ సినిమా ప్రీమియర్స్ నుండి 5 లక్షల డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్..కేవలం స్టార్ హీరోలు తప్ప ఇప్పటి వరుకు ప్రీమియర్స్ నుండి 5 లక్షల డాలర్లు కొల్లగొట్టిన హీరో ఎవ్వరు లేరు..ఒక్క విజయ్ దేవరకొండ తప్ప..పరిస్థితి చూస్తూ ఉంటె ఈ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 30 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టే అవకావం ఉందని తెలుస్తుంది..ఇదే కనుక జరిగితే ఇక మనం విజయ్ దేవరకొండ ని స్టార్ హీరో గా ఫిక్స్ అయిపోవచ్చు..ఇలాగె కెరీర్ ని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకి దూసుకుపోతే విజయ్ దేవరకొండ మరో చిరంజీవి , మార్ రవితేజ లాంటి హీరో అవుతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు..ఇవన్నీ పక్కన పెడితే ఒక్క పాన్ ఇండియన్ సినిమా చెయ్యకపోయినా కూడా విజయ్ దేవరకొండ కి బాలీవుడ్ లో మాములు క్రేజ్ లేదనే చెప్పాలి..అక్కడ కూడా ఈ సినిమాకి బంపర్ ఓపెనింగ్ దక్కలాగా ఉంది.