
గత ఏడాది చివర్లో వచ్చిన నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే యూత్ నుండి మాస్ వరుకు ప్రతి ఒక్కరు వెరెక్కిపోతారు..విడుదలకి ముందు నుండే భారీ హైప్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల తర్వాత ఓపెనింగ్స్ దగ్గర నుండి ఫుల్ రన్ వరుకు బాలయ్య బాబు మాస్ స్టామినా ఏమిటో నిరూపించేలా చేసింది..అద్భుతమైన వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద జైత్ర యాత్ర చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో 75 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది..కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు..50 రోజుల సెంటర్స్ విషయం లో కూడా నేటి తరం హీరోలు సాధ్యపడని రికార్డ్స్ సృష్టించి బాలయ్య బాబు మాస్ అంటే ఏమిటో అందరికి రుచి చూపించింది.
ఈ ఏడాది దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..విడుదల అయినా అన్ని బాషలలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేసింది..అలాంటి సినిమా కూడా అఖండ సాధించిన 50 రోజుల సెంటర్స్ కౌంట్ ని దాటలేకపోయింది..అఖండ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి దాదాపుగా 100 కి కేంద్రాలలో అర్థశత దినోత్సవం ని జరుపుకుంది..కానీ #RRR చిత్రం మాత్రం కేవలం 30 కేంద్రాల్లో మాత్రమే అర్థ శత దినోత్సవం జరుపుకుంది..ఇంత తక్కువ సెంటర్స్ రావడానికి కారణం కూడా ఉంది..సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అవ్వడం తో #RRR థియేటర్స్ అన్ని ఈ సినిమాకి వెళ్లిపోయాయి..లేకపోతే అఖండ రికార్డు ని బ్రేక్ చేసేది అని రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ అభిమానులు చెప్తున్నారు..ఏది ఏమైనా అఖండ సాధించిన ఈ అఖండమైన రికార్డు ని ఇప్పట్లో ఎవ్వరు బ్రేక్ చెయ్యలేరు అని మాత్రం అర్థం అవుతుంది.
ఇక బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కి కూడా అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..సినిమా కూడా అభిమానులకు అఖండ రేంజ్ హిట్ ఇచ్చే విధంగా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్..అఖండ తర్వాత బాలయ్య బాబు నుండి రాబోతున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి..మరి ఆ అంచనాలను డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఎంత వరుకు అందుకుంటాడో చూడాలి..ఈ సినిమా తర్వాత ఆయన ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో ఒక్క సినిమా చెయ్యబోతున్నాడు..ఎప్పుడు మాస్ సినిమాలు మాత్రమే చేసే బాలయ్య బాబు తొలిసారి తన కంఫర్ట్ జోన్ ని వదిలి కామెడీ ట్రై చేస్తున్నాడు..ఈ సినిమా లో బాలయ్య బాబు తో పాటుగా మరో యువ హీరో కూడా నటించే అవకాశం ఉంది.