
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన జల్సా సినిమా ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జల్సా సినిమాని నిన్న స్పెషల్ షోస్ గా వేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..రెండు తెలుగు రాష్ట్రాలలో జాతర ని తలపించిన ఈ సినిమా రికారుల వర్షం కురిపించింది..ఎక్కడ చూసిన హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కలకాలాడుతూ విడుదలయ్యే సినిమాలకు కూడా దడ పుట్టించేసింది ఈ సినిమా..కేవలం ఒక్క నైజం ప్రాంతం లోనే ఈ సినిమాకి దాదాపుగా 180 షోలు పడ్డాయి..పడిన ప్రతి షో కూడా హౌస్ ఫుల్ పడింది..వర్కింగ్ డే రోజు ఒక పాత సినిమా రీ రిలీజ్ కి ఈ రేంజ్ లో షోస్ పడడం , అవి ఫుల్స్ పడడం ఇప్పటి వరుకు ఎప్పుడు జరగలేదు..ఒక్క సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి సినిమా రీ రిలీజ్ కి మాత్రమే జరిగింది..ఆ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వచ్చింది.
కానీ జల్సా సినిమాకి కేవలం నైజాం ప్రాంతం లోనే కోటి 20 లక్షల రూపాయిలు వసూలు చేసింది..ఇది మాములు రికార్డు కాదు..పబ్లిక్ లో విపరీతమైన డిమాండ్ ఉండడం తో ఈ సినిమా స్పెషల్ షోస్ రెండవ రోజు కూడా బలంగా వెస్తూఇన్నయి..ఇప్పటికే హైదరాబాద్ లో 9 షోలు వెయ్యగా ఆ 9 షోలు కూడా హౌస్ ఫుల్ గా నిలిచాయి..ఇక ఈరోజు విడుదలైన రెండు సినిమాలకు ఫ్లాప్ టాక్ రావడం తో ఈరోజు హైదరాబాద్ లో మరిన్ని షోలు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా..అదే కనుక జరిగితే జల్సా సినిమా స్పెషల్ షోస్ గ్రాస్ రికార్డు ని ఇప్పట్లో ఎవ్వరు టచ్ చెయ్యలేరు అనే చెప్పొచ్చు..అయితే ఈ సినిమాకి కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఫాన్స్ తాకిడికి బయపడి షోలు ఇవ్వలేదు..ఉదాహరణకి గుంటూరు వంటి సిటీ లో ఈ సినిమాకి ఒక్క థియేటర్ కూడా ఇవ్వలేదు అంటే ఏ స్థాయిలో ఈ సినిమా రెవిన్యూ ని నష్టపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా కొన్ని చోట్ల ఈ సినిమాకే థియేటర్స్ ఇవ్వడానికి భయపడ్డారు..ముఖ్యంగా వైజాగ్ సిటీ లో కేవలం నాలుగు సింగల్ స్క్రీన్స్ మాత్రమే దక్కాయి..మిగతావి మల్టీప్లెక్స్ షోస్..అవి ఎక్కువ సీట్స్ లేని థియేటర్స్..అందుకే రికార్డు అయితే వచ్చింది కానీ..ఊహించినంత భారీ మార్జిన్ రికార్డు రాలేదు..26 లక్షల రూపాయిల గ్రాస్ ని ఈ సినిమా ఇక్కడ నుండి కొట్టింది..ఇక మిగిలిన ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతి చోట ఈ సినిమా పోకిరి రికార్డ్స్ ని డబుల్ మరియు ట్రిపుల్ మార్జిన్ తో బ్రేక్ చెయ్యడమే కాకుండా సరికొత్త బెంచ్ మార్క్స్ ని సెట్ చేసారు..ఇతర హీరోల అభిమానులకు భవిష్యత్తులో ఈ రికార్డు ని మనం కొట్టగలమా అని సందేహ పడే రేంజ్ లో మార్జిన్ నంబర్స్ పెట్టారు..ఇక ఓవర్సీస్ లో అయితే అంతకు ముందు ఉన్న రికార్డు ని డబుల్ మార్జిన్ తో దాటడం విశేషం..మొత్తం మీద ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయిలు గ్రాస్ వచ్చినట్టు సమాచారం.