
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘ధమాకా’ చిత్రం ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది..రవితేజ కి సరైన సమయం లో సరైన సూపర్ హిట్ ఈ సినిమా ద్వారా దక్కింది అనే చెప్పాలి..క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఖిలాడీ మరియు రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమాలు చేసాడు..రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..ఖిలాడీ సినిమా కాస్త యావరేజి గానే ఆడింది కానీ, రామ రావు ఆన్ డ్యూటీ మాత్రం కనీసం పది కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది..ఇక ఈయన సినిమాలు థియేటర్స్ లో ఆడవు అని అందరూ అనుకుంటున్న సమయం ధమాకా రవితేజ కెరీర్ కి మరోసారి ఊపిరి పోసింది..స్టోరీ పెద్దగా ఏమి లేదు..కానీ రవితేజ మార్క్ కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లింది.
ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువే వస్తున్నాయి..మొదటి రోజు ఓపెనింగ్స్ అదిరిపోయాయి..అదే ఫ్లో ని వీకెండ్ మొత్తం కొనసాగించింది..మూడవ రోజు వసూళ్లు అయితే మొదటి రోజు కంటే ఎక్కువ వచ్చాయి..ఇది నిజంగా అందరికి పెద్ద షాక్..ఎందుకంటే ఈమధ్య కాలం లో మొదటి రోజు కంటే మూడవ రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టిన సినిమానే లేదు..మొదటి రోజు నాలుగు కోట్ల రూపాయిలు వసూలు చేస్తే ఐదవ రోజు 5 కోట్ల రూపాయిలు వసూలు చేసింది..అలా అయిదు రోజులు పూర్తి అయ్యేసరికి ఈ చిత్రం 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది..మీడియం రేంజ్ హీరోలలో ఇది ఒక ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు..షేర్ దాదాపుగా 23 కోట్ల రూపాయిలు వచ్చి ఉంటుందని అంచనా.
ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ బాగా పుంజుకున్నాయి..ఇప్పటి వరకు ఈ చిత్రానికి మూడు లక్షల డాలర్ల వసూళ్లు వచ్చాయి..ఈ వీకెండ్ కూడా ఈ సినిమా కి అక్కడ మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 19 కోట్ల రూపాయలకు జరిగింది..వారం రోజులు కూడా గడవకముందే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల్లోకి వచ్చిందంటే ఈ చిత్రం ఎలాంటి బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు..రవితేజ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించిన చిత్రం క్రాక్..సుమారుగా 40 కోట్ల రూపాయిలు ఈ చిత్రం రాబట్టింది..ఇప్పుడు ధమాకా చిత్రానికి సంక్రాంతి వరకు రన్ ఉండే అవకాశం ఉంది..అందువల్ల ఈ చిత్రానికి 50 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు..చూడాలి మరి.