Home Entertainment అక్షరాలా 40 కోట్లు..స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని రికార్డు నెలకొల్పిన రవితేజ ‘ధమాకా’

అక్షరాలా 40 కోట్లు..స్టార్ హీరోలకు కూడా సాధ్యపడని రికార్డు నెలకొల్పిన రవితేజ ‘ధమాకా’

0 second read
0
0
1,618

మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలిరోజు ధమాకాకు డివైడ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ మూవీలో రవితేజకు జోడీగా పెళ్లిసందడి ఫేం హీరోయిన్ శ్రీలీలా నటించింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్, శ్రీలీలా గ్లామర్, డ్యాన్స్ ధమాకా మూవీకి బాగా కలిసొచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు. రవితేజ ఫ్యాన్స్ అతడి నుంచి ఏం కోరుకుంటారో అవే అంశాలను దర్శకుడు త్రినాధరావు నక్కిన జోడించాడు. దీంతో ధమాకా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ధమాకా చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలంటే రూ.19 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. అయితే తొలి మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ.15 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ రిపోర్టు స్పష్టం చేసింది. తొలిరోజు రూ.4.65 కోట్ల షేర్ రాబట్టిన ఈ మూవీ రెండో రోజు రూ.3.53 కోట్ల షేర్ రాబట్టింది. మూడో రోజు ఆదివారం, క్రిస్మస్ సెలవు కావడంతో రూ.6 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు తెలుస్తోంది.

భారీ అంచనాలతో విడుదలైన ధమాకా మూవీ మొదటి రోజే రవితేజ కెరీర్ మరో సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది. మొదటి రోజు మంచి టాక్‌తో మరింత పికప్ అయ్యిన ఈ చిత్రం వీకెండ్‌లో రెండో రోజు కూడా అదరగొట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా సాలిడ్ రన్‌తో దూసుకెళ్తుంది. ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో ప్రీమియర్స్ సహా మొదటి రెండు రోజుల్లో లక్ష 50 వేల డాలర్లకు పైగా వసూళ్లు అందుకుని స్ట్రాంగ్‌గా రన్ కొనసాగిస్తోంది. క్రాక్ తర్వాత ది బెస్ట్ అనిపించే రేంజ్‌లో ధమాకా మూవీ ఓపెనింగ్స్ అందుకుని మాస్‌లో రవితేజ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించి దుమ్ము రేపింది. ముఖ్యంగా తొలిరోజు క్రాక్ సినిమా కంటే తక్కువ రాబట్టినా రెండు, మూడు రోజుల్లో మాత్రం క్రాక్ కంటే ఎక్కువ వసూళ్లను ధమాకా అందుకోవడం విశేషం. దీంతో అవతార్, 18 పేజీస్ వంటి సినిమాలతో పోటీని తట్టుకుని ధమాకా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబడుతోంది.

కాగా ధమాకా బ్రేక్ ఈవెన్‌కు చేరాలంటే ఇంకా రూ.4 కోట్లు మాత్రమే రావాల్సి ఉంది. సోమవారంతో ధమాకా బ్రేక్ ఈవెన్‌కు చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాదిలో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి డిజాస్టర్లతో అభిమానులను నిరాశపరిచిన రవితేజ ధమాకాతో గ్రాండ్‌గా 2022కు గుడ్‌బై చెప్పాడు. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. మీడియం బడ్జెట్ రేంజ్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే రూ.18.30 కోట్ల బిజినెస్ చేసినట్టు తెలుస్తోంది. నైజాంలో రూ.5.5 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్లు, ఆంధ్రాలో రూ.8 కోట్లు, తెలంగాణ, ఏపీలో మొత్తంగా రూ.16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాలో మరో రూ.2.30 కోట్ల బిజినెస్ జరిగింది. క్రిస్మస్ సెలవులు ఉండటంతో ధమాకా మూవీ లాంగ్ రన్‌లో మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతి వరకు ధమాకా తన తడాఖా చూపించనుంది.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

రామ్ చరణ్ కోసం చేసిన అప్పులను పూడ్చేసిన ‘వారసుడు’ సినిమా

‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్‌లో చిరంజీవి ఓ మాట చెబుతూనే ఉన్నారు. ‘సరిగ్గ…