
మేజర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అడవి శేష్ హీరో గా నటించిన చిత్రం ‘హిట్ 2 ‘..విశ్వక్ సేన్ హీరో గా రెండేళ్ల క్రితం వచ్చిన ‘హిట్: ఫస్ట్ కేస్’ అనే చిత్రానికి సీక్వెల్ ఇది..రెండు సినిమాలకు కూడా న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించాడు..మొదటి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో..రెండవ సినిమా అంతకంటే పెద్ద హిట్ అయ్యింది..నిర్మాతగా నాని కి కాసుల కనకవర్షం కురుస్తూనే, అడవి శేష్ ని హీరో గా మరో మెట్టు ఎక్కించేలా చేసింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరిగింది..వరుస హిట్స్ తో ఉన్నప్పటికీ కూడా అడవి శేష్ సినిమాకి డీసెంట్ రేంజ్ బిజినెస్ మాత్రమే జరిగింది..ఈ బిజినెస్ మొత్తాన్ని కేవలం మొదటిరోజే 50 శాతం వరుకు రికవర్ అయిపోయింది..ఇక మొదటి మూడు రోజులు ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకి దారి తీసింది.
ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లను చూస్తుంటే స్టార్ హీరోల సినిమాల వసూళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అనిపిస్తున్నాయి..ముఖ్యంగా అమెరికా లో మూడు రోజులకు గాను 7 లక్షల డాలర్స్ ని వసూలు చేసిన ఈ చిత్రానికి ఆస్ట్రేలియా లో లక్ష ఆస్ట్రేలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది..ఇది మీడియం రేంజ్ హీరోలకు ఒక రేర్ ఫీట్ అని చెప్పొచ్చు..అలా మొదటి మూడు రోజులకు గాను ఈ చిత్రం 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు..మరియు 15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించిన చిత్రం గా నిలిచింది..అడవి శేష్ హీరో గా నటించిన గత చిత్రం మేజర్ కి కూడా ఇలాంటి వసూళ్లే వచ్చాయి..మీడియం రేంజ్ హీరోలకు ఇలాంటి అద్భుతమైన రన్స్ ఎప్పుడో ఒకసారి తగుల్తుంటాది..కానీ అడవి శేష్ కి మాత్రం ఒకే ఏడాది లో బ్యాక్ 2 బ్యాక్ అలాంటి సినిమాలు పడడం విశేషం.
అయితే ఇప్పుడు ఎంత పెద్ద సినిమాకి అయినా మొదటి వీకెండ్ లో వచ్చే వసూళ్లే కీలకం..ఆ తర్వాత OTT పుణ్యామా అని రన్ సరిగా ఉండటం లేదు..కానీ ‘హిట్ 2 ‘ నాల్గవ రోజు వసూళ్లు మాత్రం చాలా స్టడీ గా ఉన్నాయి..ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ సినిమాకి మాట్నీస్ నుండి హౌస్ ఫుల్ బోర్డ్స్ పడడం ప్రారంభించాయి..అలా సోమవారం రోజు దారుణంగా పడిపోతుంది అనుకున్న హిట్ 2 కలెక్షన్స్ అనూహ్యంగా పుంజుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది..మేజర్ చిత్రం ఫుల్ రన్ లో దాదాపుగా 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..ఇప్పుడు హిట్ 2 చిత్రం ఎంత వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి..ఇదే ట్రెండ్ ని ముందుకి సాగిస్తూ దూసుకుపోతే ఈ సినిమా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.