
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి సినిమా ఎంతో ప్రత్యేకం..పూరి జగన్నాథ్ ని దర్శకుడిగా పరిచయం చేసిన సినిమా ఇదే..అప్పట్లో ఈ చిత్రం ఒక సెన్సేషన్..సరికొత్త కథాంశం మరియు హీరోయిజమ్ తో తెరకెక్కిన సినిమా కావడం తో రిలీజ్ అయినా మొదట్లో నెగటివ్ టాక్ బాగా వచ్చింది..కానీ ఆ తర్వాత టాక్ మెల్లిగా పుంజుకొని పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది..అలాంటి సినిమా ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అవ్వబోతుంది..డిసెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చెయ్యడానికి ఫాన్స్ సన్నాహాలు చేస్తున్నారు..ఇప్పటికే ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోయింది..డిసెంబర్ లో ఏ తేదీన వేస్తారో తెలియదు కానీ..30 వ తారీఖున విడుదల చెయ్యడానికి మాత్రం సన్నాహాలు చేస్తున్నారు..న్యూ ఇయర్ వీకెండ్ అవ్వడం తో అభిమానులు ఈ చిత్రానికి ఒక వారం రోజులపాటు బ్రహ్మరధం పడుతారని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాని 4K క్వాలిటీ కి మార్చే ప్రక్రియ మొత్తం పూర్తి చేసేసారు..వాస్తవానికి డిసెంబర్ 30 వ తేదీన పవన్ కళ్యాణ్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిన ఇండస్ట్రీ హిట్ మూవీ ఖుషి ని ఘనంగా రీ రిలీజ్ చేద్దాం అనుకున్నారు..కానీ చివరి నిమిషం లో ఖుషి ని వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు వేసుకుంటూ బెటర్ అనే ఫీలింగ్ కి ఫ్యాన్స్ వచ్చారు..దీనితో డిసెంబర్ 30 వ తేదీన ఖుషి సినిమాకి బదులుగా బద్రి చిత్రం రాబోతుంది..ఇది వరుకు రీ రిలీజ్ అయినా సినిమాలలో అన్నిటికంటే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా జల్సా..పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్ షోస్ ఏర్పాటు చేసారు..దీనికి అనూహ్యమైన స్పందన వచ్చింది..సుమారుగా 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం కలెక్షన్స్ ని ఇప్పటి వరుకు ఎవ్వరూ ముట్టుకోలేకపోయారు.
ప్రభాస్ నటించిన బిల్లా, వర్షం , రెబెల్ మరియు ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘బాద్ షా’ సినిమాలను కూడా రీ రిలీజ్ చేసారు కానీ వాటికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు..మరి బద్రి సినిమా అయినా జల్సా రికార్డుని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి..వింటేజ్ పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే కేవలం ఫాన్స్ కి మాత్రమే కాదు..ప్రేక్షకులకు కూడా ఎంతో ఇష్టం..పాత పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అన్నా, స్టైలింగ్ అన్నా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు వెర్రెత్తిపోతారు..కాబట్టి కచ్చితంగా బద్రి మూవీ రీ రిలీజ్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపడం ఖాయం అనిపిస్తుంది..బద్రి చిత్రం ఆ రోజుల్లోనే సుమారుగా 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..రీ రిలీజ్ లో ఆ 14 కోట్ల రూపాయిల షేర్ రికార్డు ని బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించబోతోందా లేదా అనేది చూడాలి.