
యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం ఈ ఏడాది విడుదలై ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..విడుదలకి ముందు నుండే భారీ అంచనాలను ఏర్పాటు చేసిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రభంజనాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది..విడుదలకు ముందు థియేటర్స్ దొరకడమే చాలా కష్టమైపోయింది ఈ సినిమాకి విడుదల తర్వాత కనివిని ఎరుగని రేంజ్ లో డిమాండ్ ఏర్పడింది..మొదటి రోజు మొదటి ఆట నుండే అద్భుతమైన టాక్ రావడం తో రోజు రోజుకు షోస్ పెంచుకుంటూ పోయింది..ఇక హిందీ లో అయితే ఈ సినిమా అక్కడ బడా హీరోలు అని చెప్పుకొని తిరిగే అమిర్ ఖాన్ మరియు అక్షయ్ కుమార్ వంటి హీరోల కొత్త సినిమాల కలెక్షన్స్ ని కూడా అధిగమించి బాలీవుడ్ విమర్శకుల నోర్లు మూయించడం పెద్ద చర్చకి దారి తీసింది..6 లక్షల నెట్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పుడు పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రాబట్టింది అంటే చిన్న విషయం కాదు.
ఇక తెలుగు లో కూడా ఈ సినిమా ఎన్ని కొత్త సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి వీకెండ్ వస్తే చాలు హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడిపోతున్నాయి..విచిత్రం ఏమిటి అంటే ఈ సినిమాకి గత వీకెండ్ లో వచ్చినన్ని ఫుల్స్ మొన్న విడుదలైన లైగర్ సినిమాకి కూడా రాకపోవడం షాక్ కి గురి చేసే విషయం..అంటే ఈ సినిమా జనాల్లోకి ఏ రేంజ్ లో వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు..ఇక హిందీ లో కూడా ఈ సినిమా ఇప్పటికి లాంగ్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది..డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారిన సినిమాగా నిలిచింది..మొత్తం మీద ఇప్పటి వరుకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయిల షేర్ మరియు వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కు ని దాటేసింది..హీరో నిఖిల్ ని ఒక్కసారిగా పాన్ ఇండియా హీరో ని చేసేసింది ఈ చిత్రం.
ఇక ఈ సినిమా ఓవర్సీస్ ప్రభంజనం గురించి మాట్లాడుకోకపోతే ఎలా..ఇప్పటి వరుకు ఈ సినిమా ఇక్కడ దాదాపుగా 13 లక్షలకు పైగా డాలర్స్ ని వసూలు చేసి ఇప్పటికి డీసెంట్ వసూళ్లను రాబడుతుంది..అక్కడి ట్రేడ్ వర్గాలు చెప్తున్నా మాట ఏమిటి అంటే ఈ సినిమా ఫుల్ రన్ లో 20 లక్షల డాలర్లు వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నాయి..అదే కనుక జరిగితే ఈ ఏడాది రెండు మిలియన్ల డాలర్లు వసూలు చేసిన భీమ్లా నాయక్, KGF చాప్టర్ 2 మరియు సర్కారు వారి పాట సినిమా తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమా గా నిలిచిపోతుంది..అదేంటి #RRR గురించి చెప్పలేదు అనుకుంటున్నారా..దానితో పోల్చడం ఎందుకు అని నాన్ #RRR సినిమాలుగా చెప్తున్నాం అంతే..ఇక హిందీ ;లో అయితే ఈ సినిమా వసూళ్లు ఇప్పట్లో ఆగవు..ఫుల్ రన్ లో కనీసం 50 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..చూడాలి మరి.