
భారతదేశ రాజకీయ చరిత్రలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టూ సంచలనం రేపింది.అదేమిటంటే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం, దీనియొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే 500 రూపాయలు పెట్టి పార్టీ లో సభ్యత్వం తీసుకుంటే, ఏ కారణం చేత అయినా ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయిల ఆర్ధిక సహాయం జనసేన పార్టీ ద్వారా అందుతుంది.అంతే కాదు సభ్యత్వం తీసుకున్న ప్రతీ ఒక్కరికి ఏ చిన్న సమస్య వచ్చిన జనసేన పార్టీ నాయకులకు తెలిపిన వెంటనే ఆర్ధిక సహాయం అందుతుంది.ఇప్పటి వరకు రెండు విడతల్లో ఈ సాబుత్త్వ నమోదు కార్యక్రమం జరగగా, 133 కి పైగా కుటుంబాలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆర్ధిక సహాయం పొందినట్టు పవన్ కళ్యాణ్ మొన్న ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసాడు.ప్రస్తుతం మూడవ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో చురుగ్గా పాల్గొంటున్నారు.28 వ తారీఖున ముగియాల్సిన సభ్యత్వ నమోదు కార్యక్రమం కి అద్భుతమైన రెస్పాన్స్ రావడం తో మార్చి మూడవ తేదీ వరకు పొడిగించారు.ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి లక్షకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి అని వినికిడి.ఇది ఇండియన్ పాలిటిక్స్ లోనే సరికొత్త రికార్డు అట.కేవలం కోనసీమ ప్రాంతం నుండే జనసేన పార్టీ కి 30 వేలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, తెలంగాణ ప్రాంతం లో 20 వేలకు పైగా జనసేన అభిమానులు క్రియాశీలక సభ్యత్వాలను నమోదు చేసుకున్నారని తెలుస్తుంది.మొత్తం మీద మూడవ విడత లో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి లక్షకు పైగా సభ్యత్వాలు వచ్చాయని తెలుస్తుంది.ఈరోజు రేపు మూడవ విడత సభ్యత్వాలకు చివరి రోజులు కావడం తో మరింత జోరుగా సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం ఉందని జనసేన నాయకులు చెప్తున్నారు.
ఇక ఈ నెల 14 వ తేదీన మచిలీపట్టణం లో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 34 ఎకరాల విస్తీర్ణం ఉన్న స్థలం లో అంగరంగ వైభవంగా జరగనుంది.ఈ కార్యక్రమం లో పవన్ కళ్యాణ్ రాబొయ్యే ఎన్నికలలో భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందో తెలియజెయ్యనున్నాడు.ఈ కార్యక్రమం కోసం కేవలం జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు మాత్రమే కాదు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.మంగళగిరి కార్యాలయం నుండి పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం మీద సభ స్థలికి చేరుకోబోతున్నాడు.రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఆవిర్భావ దినోత్సవం ఎలాంటి ప్రకంపనలు రేపబోతుందో చూడాలి.