
మన సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కౌపీలే లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా సమంత మరియు నాగ చైతన్య ల పేర్లు ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..అలాంటి ఈ జంట విడిపోయారు అని వార్త తెలియగానే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో బాధపడ్డారు..వీళ్లిద్దరు విడిపొయ్యి ఇనాళ్ళు అవుతున్న కూడా ఇప్పటికి వీళ్ళ గురించి రోజు ఎదో ఒక్క వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంది..ఇప్పుడు తాజాగా మరో వార్త అందరిని ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నది..ఇక అసలు విషయానికి వస్తే సమంత అక్కినేని ఫామిలీ పై తన పగ తీర్చుకోబోతుంది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..అది మీరు అనుకున్నట్టు సినిమాల్లో చూపించే విధంగా కక్ష సాధింపు పగ కాదండోయ్..బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కినేని ఫామిలీ కి నువ్వా నేనా అనే విధమైన పోటీ అతి త్వరలోనే ఇవ్వనుంది సమంత..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.
ఇక అసలు విషయానికి వస్తే విడాకుల తర్వాత సమంత కెరీర్ జెట్ స్పీడ్ లో ముందుకి దూసుకుపోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రస్తుతం ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి..వాటిల్లో ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న రెండు పాన్ ఇండియన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఉన్నాయి..వాటిలో ఒక్కటి యశోద అనే సినిమా కాగా మరొక్కటి శాకుంతలం అనే సినిమా ఒక్కటి, ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నాయి..వీటిల్లో యశోద అనే సినిమా ఆగష్టు 11 వ తేదీన విడుదల చెయ్యడానికి ఆ చిత్ర దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు అట..కానీ ఆగష్టు 12 వ తేదీన అక్కినేని అఖిల్ కెరీర్ కి ఎంతో ముఖ్యమైన సినిమా ఏజెంట్ విడుదల అవ్వబోతుంది, ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు..ఈ సినిమా అక్కినేని కెరీర్ లో మెయిలు రాయిగా నిలిచి ఆయనని స్టార్ హీరో గా నిలబెడుతుంది అని అక్కినేని అభిమానులు బలంగా నమ్ముతున్నారు..వాళ్ళ అంతలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ సినిమాకి పోటీ గా తన సినిమాని దింపబోతుంది సమంత.
ఇది ఇలా ఉండగా మరో పక్క అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లోకి అమిర్ ఖాన్ హీరో గా తెరకెక్కిన లాల్ సింగ్ ఛధా ద్వారా అడుగుపెట్టబోతున్నాడు..ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య ఒక్క పవర్ ఫుల్ రోల్ చేసాడు..ఈ సినిమా కూడా ఆగష్టు 12 వ తేదీన విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నది..సమంత నటించిన యశోద సినిమా పాన్ ఇండియా మూవీ అవ్వడం తో బాలీవుడ్ లో ఈ సినిమా అమిర్ ఖాన్ మరియు నాగ చైతన్య సినిమాకి పోటీ గా నిలబడనుండి..అలా ఒక్కేసారి అన్నదమ్ములు ఇద్దరికీ అటు టాలీవుడ్ లో ఇటు బాలీవుడ్ లో ఝలక్ ఇవ్వడానికి సిద్ధం అయిపోయింది సమంత..పొరపాటున సమంత సినిమా ఆ రెండు సినిమాలకంటే పెద్ద హిట్ గా నిలిస్తే మాత్రం అక్కినేని ఫామిలీ పరువు పొయ్యే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..మరి ఉత్కంఠ భరితంగా మారిన ఈ బాక్స్ ఆఫీస్ పోరు లో ఎవరు విజేతగా నిలవబోతున్నారో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.