
టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి క్యారక్టర్ ఆర్టిస్టు మరియు విలన్ రోల్స్ ద్వారా పాపులారిటీ ని సంపాదించి ఆ తర్వాత హీరో గా నిలదొక్కుకున్న నటుడు అడవి శేష్..ఇప్పటి వరుకు ఈయన హీరోగా నటించిన క్షణం, అమితుమీ , గూడాచారి, ఎవరు మరియు మేజర్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి..అడవి శేష్ లో ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ ఏమిటి అంటే, అతను హీరో గా చేసిన సినిమాలకు అతనే కథ , స్క్రీన్ ప్లే మరియు మాటలు సమకూరుస్తాడు..ప్రస్తుతం ఆయన హిట్ సినిమా సీక్వెల్ లో నటిస్తున్నాడు..అయితే ఇన్నేళ్ల నుండి ఇండస్ట్రీ లో ఉన్న అడవి శేష్ పై ఇప్పటి వరుకు ఎలాంటి రూమర్ రాకపోవడం విశేషం..కానీ సోషల్ మీడియా గురించి తెలిసిందే కదా..పలానా హీరో పై ఎలాంటి రూమర్ లేదు అని తెలిస్తే ఆ హీరో పై ప్రత్యేకమైన రూమర్స్ పుట్టించి కాష్ చేసుకుంటారు..సరిగ్గా అడవి శేష్ విషయం లో కూడా అదే జరిగింది.
ఇక అసలు విషయానికి వస్తే అడవి శేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం గూఢచారి..ఈ సినిమా ద్వారా అక్కినేని నాగార్జున కోడలు సుప్రియ గారు ఇండస్ట్రీ కి రీ ఎంట్రీ ఇచ్చారు..సుప్రియ అంటే ఎవరో మన అందరికి తెలిసిందే..పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది..తొలి సినిమాతోనే నటన పరంగా అందం పరంగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా ఎందుకో సినిమా ఇండస్ట్రీ కి దూరంగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది..అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వైవాహిక జీవితం మధ్యలోనే విడాకులు ద్వారా బ్రేక్ పడింది..ఇక ఆ తర్వాత ఈమెకి అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ కి మ్యానేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించాడు..ఇవన్నీ పక్కన పెడితే గూఢచారి సినిమాలో నటించే ముందే సుప్రియ అడవి శేష్ కి స్నేహితురాలట.
అయితే సోషల్ మీడియా గురించి మనకి తెలిసిందే కదా..ఒక హీరో హీరోయిన్ స్నేహం గా మెలిగితే వాళ్లకి ఇష్టమొచ్చిన సంబంధాలు అంటగడుతారు..వీళ్లిద్దరి విషయం లో కూడా అదే జరిగింది..సుప్రియ కి మరియు అడవి శేష్ కి మధ్య ఎదో ఉన్నట్టు..త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగాయి..అయితే ఈ గాసిప్స్ సుప్రియ చెవినపడి చాలా ఫైర్ అయ్యిందట..నాకు ఎందుకు వచ్చింది తలపోటు ఈ సినిమా నేను చేయకపోవడమే మంచిది అని గూఢచారి టీం కి చెప్పేసిందట..అయితే టీం ప్రత్యేకంగా ఆమెని రిక్వెస్ట్ చెయ్యడం తో ఈ సినిమా పూర్తి చేసింది..అయితే ఇదే విషయాన్నీ అడవి శేష్ ని ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో అడగగా ‘సోషల్ మీడియా అన్న తర్వాత ఇలాంటివి చూసి చూసి అలసిపొయ్యాం..మా పేరు మీద వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు..బ్రతకనియ్యండి వాళ్ళని కూడా..ఈ కాలం లో ఇలాంటి గాసిప్స్ ని పట్టించుకునేంత కాలిగా మేము లేము..జనాలు కూడా లేరు’ అంటూ చెప్పుకొచ్చాడు అడవి శేష్.