
ఇటీవల జరిగిన వీర సింహా రెడ్డి విజయోత్సవ సభలో నందమూరి బాలకృష్ణ పొరపాటున నోరు జారిన విధానం పై సోషల్ మీడియా లో నెటిజన్స్ నుండి ఎలాంటి ట్రోలింగ్స్ వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాము..ప్రసంగం మధ్యలో ‘అక్కినేని తొక్కినేని’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు అక్కినేని ఫ్యాన్స్ తీవ్రమైన నిరసన వ్యక్తం చేసారు..’బాలయ్య బాబు క్షమాపణలు చెప్పాలి’ అంటూ ‘డౌన్ డౌన్ బాలయ్య’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను తగలబెట్టారు అక్కినేని ఫ్యాన్స్.. అంతే కాకుండా అక్కినేని నాగార్జున కుమారులు కూడా దీనిపై చాలా కూల్ గా తమదైన రీతిలో సమాధానం చెప్పారు..కానీ నాగార్జున మాత్రం ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు..తన పిల్లలతో బాలయ్య కి బుద్ధి చెప్పినట్టు చేసాడు..అయితే మొత్తానికి ఈరోజు బాలయ్య బాబు మీడియా ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించాడు..వివాదం కి ఫుల్లు స్టాప్ పెడుతాడు అనుకుంటే నిప్పుల కొలిమి మీద పెట్రోల్ పోసినట్టు చేసాడు బాలయ్య.
ఈ విషయం పై స్పందిస్తూ ‘నేను ఇప్పుడే కాదు ఎన్నో సందర్భాలలో చెప్పాను..అక్కినేని నాగేశ్వర రావు గారు , ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని..అక్కినేని నాగేశ్వర రావు గారు నాకు బాబాయ్ తో సమానం..నేనేదో ఫ్లో లో అన్న మాటల్ని సీరియస్ గా తీసుకుంటే నాకు అసలు సంబంధమే లేదు..నేను నాన్న గారి నుండి క్రమశిక్షణ తో ఎలా పెరగాలి అనేది నేర్చుకున్నాను..నాగేశ్వర రావు గారి నుండి పొగడ్తలకు ఎలా ప్రభావితం కాకుండా ఉండాలి అనేది నేర్చుకున్నాను..ఆయన నన్ను తన సొంత బిడ్డలకంటే ఎక్కువగా చూసుకునేవాడు ఆప్యాయంగా..ఎందుకంటే ఆయన కుటుంబం లో ఆప్యాయత లేదు..నా దగ్గర ఉంది’ అంటూ ఎంతో పొగరుతో సమాధానం చెప్పాడు..ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇంతకుముందు వ్యాఖ్యలకంటే ఎక్కువ వివాదాలకు దారి తీసింది..దీని పై అసలు నాగార్జున స్పందిస్తాడా లేదా అనేది చూడాలి.
అయినా బాలయ్య కి నాగార్జున అంటే ఎందుకు అంత కోపం..గతం లో వీళ్లిద్దరి మధ్య ఏమైనా జరిగిందా..లేదా రెండు కుటుంబాలకు మొదటి నుండి పడడం లేదా..?అలా అనడానికి కూడా ఆస్కారం లేదే..ఎందుకంటే నాగేశ్వర రావు గారు బాలయ్య తో రెండు సినిమాల్లో నటించాడు..అలాగే హరి కృష్ణ నాగార్జున హీరో గా నటించిన ‘సీతారామ రాజు’ చిత్రం లో ముఖ్య పాత్ర పోషించాడు..అంతే కాకుండా అక్కినేని నాగచైతన్య మొదటి చిత్రం జోష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బాలయ్య ముఖ్య అతిధిగా హాజరై నాగ చైతన్య ని ఆశీర్వదిస్తాడు..అంత బాగానే ఉంది కానీ ఇప్పుడు నాగార్జున మీద ఎందుకు బాలయ్య ఇంత కోపం చూపిస్తున్నాడు అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.