Home Entertainment అక్కినేని అభిమానులకు కోలుకోలేని షాక్ ని ఇచ్చిన సమంత

అక్కినేని అభిమానులకు కోలుకోలేని షాక్ ని ఇచ్చిన సమంత

0 second read
0
1
15,798

సౌత్ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు ప్రఖ్యాతలు పొందిన సమంత మరియు నాగ చైతన్య విడాకులు తీసుకున్న సంఘటన అటు అభిమానులకే కాకుండా ఇటు సినీ ప్రేక్షకులకు కూడా ఊహించని షాక్ ని ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే, వీళ్లిద్దరు విడాకులు తీసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకున్నప్పటికీ సోషల్ ఇండియా లో వీరిద్దరి గురించి రోజు ఎదో ఒక్క వార్త ప్రచారం అవుతూ ఉండే సంగతి మన అందరికి తెలిసిందే, తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక్క వార్త అక్కినేని అభిమానులకు కోలుకోలేని షాక్ అనే ఇస్తుంది అనే చెప్పాలి, సమంత సౌత్ లోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ అనే సంగతి మన అందరికి తెలిసిందే,ఇప్పటికి ఆమె సౌత్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీ గా గడుపుతుంది, ఆమెకి ఉన్న డిమాండ్ ప్రస్తుతం అక్కినేని హీరోలెవ్వరికి లేదు అనడం లో ఏ మాత్రం అతి సయోక్తి లేదు, ఇటీవలే ఆమె పుష్ప సినిమా లో చేసిన ఒక్క ఐటెం సాంగ్ అక్షరాలా ఒక్క కోటి రూపాయిలు తీసుకుంది.

నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె కెరీర్ కాస్త స్లో అవ్వొచ్చు అని అందరూ అనుకున్నారు, కానీ ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే ఎవరికైనా మైండ్ పోవాల్సిందే, ప్రముఖ దర్శకుడు గుణ శేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న శాకుంతలం అనే సినిమాలో సమంత టైటిల్ పాత్ర ని పోషిస్తుంది, ఈ సినిమా తో పాటు ఆమె యశోద అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా నటిస్తుంది, ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో భారీ బడ్జెట్ తో అన్ని బాషలలో తెరకెక్కనుంది, ఈ సినిమాని ఆగష్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు, ఇక్కడే ఒక్క ట్విస్ట్ ఉంది, అదేమిటి అంటే ఆగష్టు 12 వ తేదీన అక్కినేని అఖిల్ మరియు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్నా ఏజెంట్ సినిమా విడుదలకి సిద్ధం గా ఉంది, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇటీవలే చేసారు, అఖిల్ కి ఈ సినిమా ఎంతో ప్రత్యేకం, ఎందుకంటే ఆయన కెరీర్లోనే ఇది భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా.

మరో పక్క సమంత కి కూడా యశోద అనే సినిమా ఎంతో ముఖ్యం, ఈ సినిమాని ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది, ఈ రెండు సినిమాలు పోటీ పడక తప్పటట్టు లేదు అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త, మరోపక్క అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ లో అమిర్ ఖాన్ హీరో గా నటించిన లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ఒక్క ముఖ్య పాత్ర పోషించారు, ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా ఆగష్టు 12 వ తేదీన విడుదల కాబోతుంది, కానీ ఈ సినిమా కేవలం హిందీ లో మాత్రం వస్తుండడం తో ఇక్కడ సమంత సినిమా తో పోటీ పడే ఛాన్స్ తప్పింది, కానీ అక్కినేని అఖిల్ మరియు సమంత మధ్య మాత్రం బాక్స్ ఆఫీస్ వార్ తప్పేలా లేదు, మరి వీరిద్దరిలో ఎవరు పై చెయ్యి సాధిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, అఖిల్ ఈ సినిమా తన కెరీర్ లో మెయిలు రాయిగా నిలిచిపోతుంది అనే నమ్మకం తో ఉన్నాడు, మరి ఆయన నమ్మకం ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…