Home Entertainment అక్కినేని అఖిల్ తో సమంత..? నాగ చైతన్య కి ఇది కోలుకోలేని షాక్

అక్కినేని అఖిల్ తో సమంత..? నాగ చైతన్య కి ఇది కోలుకోలేని షాక్

0 second read
0
0
5,012

సౌత్ ఇండియాలోనే టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..ఏ మాయ చేసావే అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైనా ఈమె తోలి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకుంది..ఇక ఆ తర్వాత ఈమెకి టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది..హిట్స్ వచ్చాయి..బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి..ఇండస్ట్రీ హిట్స్ కూడా వచ్చాయి..ఇక ఆ తర్వాత ఈమెకి ఒక స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది..కెరీర్ ఆ రేంజ్ పీక్స్ లో ఉన్నప్పుడే అక్కినేని నాగ చైతన్య ని ప్రేమించి పెళ్లాడింది..పెళ్లి తర్వాత కూడా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది..కానీ దురదృష్టం కొద్దీ ఈమె నాగ చైతన్య తో గత ఏడాది కొన్ని విభేదాల కారణం గా విడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరు విడిపోయి ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటికి వీళ్ళ గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త రాకుండా ఉండట్లేదు.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న ఒక వార్త టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతోంది..అదేమిటి అంటే అతి త్వరలోనే ఆమె అక్కినేని అఖిల్ తో కలిసి ఒక సినిమాలో నటించబోతుంది అట..ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ క్రేజీ కాంబినేషన్ ని ఇటీవలే సెట్ చేసినట్టు సమాచారం..ఇక ఈ చిత్రానికి దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది..అయితే ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుందా..లేదా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది అనేది తెలియాల్సి ఉంది..ఇటీవల కాలం లో ఆమె విలన్ రోల్స్ కూడా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమాలో కూడా అలాంటి పాత్ర చేస్తుందా అనేది చూడాలి..ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగు లో శాకుంతలం మరియు యశోద అనే సినిమాలతో పాటు విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న ఖుషి అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది..ఈ సినిమాలతో పాటు ఆమె పలు తమిళం మరియు హిందీ సినిమాల్లో నటిస్తుంది.

ఇక త్వరలో అఖిల్ తో సినిమా చేస్తుంది అనే వార్తలు రావడం తో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు..అఖిల్ తో చేస్తుంది కదా ,నాగ చైతన్య తో కూడా భవిష్యత్తులో నటిస్తుందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..ఇదే విషయాన్నీ ఇటీవలే జరిగిన కొన్ని ఇంటర్వూస్ లో నాగ చైతన్య ని అడగగా..సమంత అంటే తనకి ఇప్పటికి ఎంతో గౌరవం అని..ఆమెతో కలిసి నటించాల్సిన అవసరం వస్తే కచ్చితంగా నటిస్తాను అని..అందులో తనకి ఎలాంటి అభ్యంతరం లేదంటూ కామెంట్ చేసాడు..కానీ సమంత వైపు అది పూర్తి వేరేలా ఉంది..నాగ చైతన్య పేరు ఎత్తితేనే మండిపొయ్యే రేంజ్ లో ఉంది..ఇటీవలే బాలీవుడ్ పాపులర్ షో ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లో పాల్గొనింది..ఈ ప్రోగ్రాం చూస్తే సమంత కి నాగ చైతన్య మీద ఎంత కోపం ఉంది అనేది అర్థం అవుతుంది..మరి వీరిద్దరూ భవిష్యత్తులో కలిసి నటిస్తారో లేదో చూడాలి..ఒకవేళ కలిసి నటిస్తే మాత్రం పెద్ద సెన్సేషన్ అవుతుంది అనే చెప్పొచ్చు.

Load More Related Articles
Load More By tollywoodsuperstar
Load More In Entertainment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ఈ ఏడాది ఇంటర్ లో ఫెయిల్ అవ్వడం వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఎంతో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ రెండు సంవత్సరాల పరీక్షల ఫలితాలను ఈ బుధవారం రోజు ప్రకటించిన సంగతి తె…